Home
News

వాట్సప్ వాడేవారికి హెచ్చరికలు జారీ చేసిన SBI

State Bank of India (SBI) వాట్సప్ వాడుతున్న యూజర్లకు అలర్ట్ మెసేజ్ లు జారీ చేసింది. వాట్సప్ ద్వారా వ్యక్తిగత వివరాలు అలాగే బ్యాంకు వివరాలను పంపమని SBI వారు అడుతున్నట్లుగా ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయని వ

State Bank of India (SBI) వాట్సప్ వాడుతున్న యూజర్లకు అలర్ట్ మెసేజ్ లు జారీ చేసింది. వాట్సప్ ద్వారా వ్యక్తిగత వివరాలు అలాగే బ్యాంకు వివరాలను పంపమని SBI వారు అడుతున్నట్లుగా ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయని వీటిని నమ్మి మోసపోవద్దని యూజర్లకు అలర్ట్ మెసేజ్ లు జారీ చేసింది.

వాట్సప్ వాడేవారికి హెచ్చరికలు జారీ చేసిన SBI

కాగా కొందమంది సోషల్ మీడియా ద్వారా ఇటువంటివి అందుకున్నట్లుగా కంప్లయింట్లు వస్తున్నాయని ఓటీపీ అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. వీటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఇప్పుడు వాట్సప్ లో నడుస్తున్న స్కామ్ వివరాలను ఓ సారి చూద్దాం.

ఫ్రైజ్ మనీ

ఫ్రైజ్ మనీ

వాట్సప్ లో కొంతమందికి మీరు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ గెలుచుకున్నారని దీనిని మీ బ్యాంకు అకౌంట్లలోకి పంపిచేందుకు ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారు. అయితే అది ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దు.

ఫేక్ లింక్స్

ఫేక్ లింక్స్

మరికొందరు ఈ లింక్ క్లిక్ చేసి మీరు గెలుచుకున్న మొత్తాన్ని చూడవచ్చంటూ ఓ లింక్ పంపిస్తారు. అటువంటి వాటిని ఓపెన్ చేయవద్దు. అవి ఓపెన్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని వారు వేరే విధంగా హ్యాక్ చేసి మీ అకౌంట్లు గుల్ల చేసే అవకాశం ఉంది.

డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు

డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు

బ్యాంకు ఎంప్లాయినంటూ పరిచయం చేసుకునే వారిని అస్సలు నమ్మవద్దు. వారు మీ డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు అప్ డ్రేడ్ చేశాం. దానిని చెక్ చేసేందుకు వివరాలు చెప్పమని అడుగుతారు. మీరు పొరపాటున సివివి నంబర్ చెబితే మీ అకౌంట్లోని మొత్తాన్ని కాజేస్తారు.

ఎసెమ్మెస్ మోసాలు

ఎసెమ్మెస్ మోసాలు

ఎసెమ్మెస్ ద్వారా కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మీరు హ్యాకర్లు పంపిన లింకులను క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా మీ సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. వారు CVV, expiry date and card number లాంటి వాటిని ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది.

మాల్ వేర్

మాల్ వేర్

ఇక మీ ఫోన్లోకి ఏదో ఒక మాల్వేర్ ని ప్రవేశపెట్టి దాని ద్వారా వారు అనుకున్నది సాధించుకుంటారు. వారు మీ ఒటిపిని తెలుసుకునేందుకు అనేక రకాల మార్గాలను అన్వేసిస్తుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి లొంగవద్దు.

రీఫండ్

రీఫండ్

ఒకవేళ మీరు ఇలాంటి స్కాముల్లో ఇరుకున్నట్లయితే వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయండి. మూడు రోజుల్లో మీ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడుతుంది. మీరు ఒకవేళ ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 1-800-111109కి కాల్ చేసి వివరాలను చెబితే వారు మీకు ఏదైనా సాయం చేస్తారు.

మెసేజ్ ద్వారా

మెసేజ్ ద్వారా

మీరు మెసేజ్ ద్వారా వివరాలను పంపాలనుకుంటే "Problem" అని టైప్ చేసి 9212500888 కి ఎసెమ్మెస్ చేయండి. లేకుంటే ట్విట్టర్ ద్వారా @SBICard_Connectకి రిపోర్ట్ చేయండి.

Best Mobiles in India

English summary
State Bank of India (SBI) is warning users about this WhatsApp scam: All you must know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X