Home
News

SBI అలెర్ట్ : డిసెంబర్ 1,2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ కస్టమరా? అయితే డిసెంబర్ 1, 2018 లోగా బ్యాంకులో మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ కస్టమరా? అయితే డిసెంబర్ 1, 2018 లోగా బ్యాంకులో మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి లేదా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ బ్లాక్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రకటనను వినియోగదారుల కోసం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఖాతాదారుల బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.

రిజిస్ట్రేషన్ ఇలా చెక్ చేసుకోండి ...

రిజిస్ట్రేషన్ ఇలా చెక్ చేసుకోండి ...

- ఎస్‌బీఐ అకౌంట్‌తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉందో తెలుసుకోవడానికి మొదటి నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావాలి.

- లాగిన్ అయిన తర్వాత బ్యాంకింగ్ హోంపేజీలో ‘My Account and Profile' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- అక్కడ ఉండే ప్రొఫెల్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసి.. ‘Personal Details/Mobile' పై క్లిక్ చేయాలి.

- అప్పుడు ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని అగుడుతారు. ప్రొఫైల్ పాస్‌వర్డ్ నమోదుచేసిన తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలు స్క్రీన్‌సై కనిపిస్తాయి. ఒకవేళ ఫోన్ నెంబరు కనిపించకపోతే సంబంధిత బ్యాంకును సంప్రదించి మోబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

నెట్ బ్యాంకింగ్ ఎక్కువ చేసే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...

నెట్ బ్యాంకింగ్ ఎక్కువ చేసే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...

దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ను వినియోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువ కావడంతో నేరుగా ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాంకులన్నీ మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం ప్రత్యేకంగా యాప్స్‌ను రూపొందించి ఖాతాదారులకు అందుబాటులో కి తెచ్చాయి. అయితే ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ద్వారా గా నీ మొబైల్‌ ద్వారా కానీ నెట్‌ బ్యాకింగ్‌ను ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం

 

 

షాపింగ్ సమయంలో...

షాపింగ్ సమయంలో...

షాపింగ్‌లు చేసినప్పుడు కనబడిన ప్రతీ సైట్‌ల మీద లాగిన్‌ కాకుండా పేరొందిన వెబ్‌సైట్స్‌లోనే షాపింగ్‌ చేయడం మంచిది. ఏదైనా సైట్‌లో షాపింగ్‌ చేసినప్పుడు ఆ పేమెంట్‌ గేట్‌వేకి మనం వెళ్లిన తర్వాత బ్యాంక్‌లాగిన్‌, పాస్‌వర్డ్‌ వేసే ముందు ఆ సైట్‌ అడ్రస్‌ హెచ్‌టీటీపీ://లో మొదలవుతోందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా లేకపోతే ఆ సైట్‌లో షాపింగ్‌ చేయకండి. అటువంటి సైట్స్‌ సేఫ్‌ కాదనేది గుర్తించుకోండి.

స్పామ్ కాల్స్....

స్పామ్ కాల్స్....

బ్యాంక్‌ వివరాలను తెలియజేయమని వచ్చే కాల్స్‌, ఈ -మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించకండి. ఎందుకంటే బ్యాంక్‌ సంబంధించిన వారు అటువంటి వివరాలను అడగరు. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌లకు వాడే ఈ-మెయిల్స్‌, ఫోన్‌ నెంబర్లను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది.

బ్యాంక్‌ వెబ్‌సైట్‌....

బ్యాంక్‌ వెబ్‌సైట్‌....

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించాలంటే సంబంధిత బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్‌ బ్రౌజర్‌లో టైపు చేసి మాత్రమే ఓపెన్‌ చేయాలి. వేరే వెబ్‌సైట్లలో ఉండే లింక్‌ల ద్వారా ఓపెన్‌ చేస్తే బ్యాంక్‌ సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

పాస్‌వర్డ్....

పాస్‌వర్డ్....

మొబైల్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డులను కనీసం మూడు నెలలకొకసారి అయినా మారుస్తుండాలి. ఎవరెనా మీ ఫోన్‌ నెటవర్క్‌ బాగాలేదు, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయండి అని చెబితే వెంటనే జాగ్రత్త పడండి. ఒక వేళ అటువంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే అప్పుడు మీ మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, అకౌంట్లను లాక్‌ చేయండి. పాస్‌వర్డ్‌లు, ఈ-మెయిల్స్‌, మొబైల్‌ నెంబర్‌ను మార్చండి.

స్టేట్‌మెంట్స్‌....

స్టేట్‌మెంట్స్‌....

మీకు సంబంధించిన బ్యాంక్‌ లావాదేవీలను ఎప్పుడూ పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ చూసుకోవడం మంచిది. బ్యాంక్‌ గానీ మొబైల్‌ సేవలకు సం బంధించి ఎలాంటి అంతరాయమున్నా వాటిని గమనించినట్లయితే వెంటనే సంబంధిత కంపెనీని సంప్రదించి వివరాలు తెలుసుకోవడం మర్చిపోవద్దు.

 

 

ఈ-మెయిల్‌ లో వివరాలు వద్దు...

ఈ-మెయిల్‌ లో వివరాలు వద్దు...

కొన్ని బ్యాంకులు నెట్‌ బ్యాంకింగ్‌కి ఏటీ ఎంకి లింక్‌ పెడతాయి. ఇటువంటి పరిస్థితులలో ఏటీఎం కార్డుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే క్రెడిట్‌ కార్డు ఇతర బ్యాంకు వివరాలను ఈ-మెయిల్‌ ద్వారా పంపడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

పరిచయం లేని వ్యక్తుల సాయం వద్దు....

పరిచయం లేని వ్యక్తుల సాయం వద్దు....

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ చేసేటప్పుడు పరిచయం లేని వ్యక్తుల నుంచి సాయాన్ని కోరడం మంచిది కాదు. నెట్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారని తెలిసే కొందరు హెల్ప్‌ చేస్తామంటూ ముందుకొస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

 

 

రక్షణ వ్యవస్థ....

రక్షణ వ్యవస్థ....

యాంటీ వైరస్‌ రక్షణ లేని పీసీలను నెట్‌ బ్యాంకింగ్‌లకు వాడకపోవడం మంచిది. ఎందుకంటే సరైన రక్షణ వ్యవస్థ లేని సిస్టమ్‌లను హ్యాకర్లు సులువుగా వారీ అధీనంలోకి తీసుకోగలరు. వాడుతున్న బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
SBI net banking to be shut for accounts not linked with mobile: RBI should mandate uniform safety norms across banks.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X