Home
News

SBI యూజర్స్... ఇటువంటి ఇమెయిల్ వచ్చిందా జాగ్రత్త సుమా!!

ఇండియాలో ఎక్కువ మంది తమ యొక్క డబ్బులను దాచుకోవడానికి అకౌంటును ఓపెన్ చేయడానికి ఎంచుకునే మొదటి ఎంపికలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముందు వరుసలో ఉంటుంది. ప్రభుత్వ ఉద్యుగులు ఎక్కువ శాతం ఇందులోనే తమ యొక్క అకౌంటును కలిగి ఉంటారు. ఇప్పుడు సైబర్ మోసగాళ్లు SBI అకౌంట్ హోల్డర్లను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారి యొక్క ఇమెయిళ్ళకు మరియు ఫోన్ నెంబర్లకు తప్పుడు మెసేజ్ లను పంపుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SBI ట్వీట్ నకిలీ ఇమెయిల్ సారాంశం

SBI ట్వీట్ నకిలీ ఇమెయిల్ సారాంశం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ రోజు ట్వీట్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ యొక్క సారాంశం విషయానికి వస్తే మోసగాళ్ళు SBI నుండి పంపుతున్నట్లు కొన్ని నకిలీ ఇమెయిళ్ళను మరియు మెసేజ్లను పంపుతున్నారని SBI పేర్కొంది. SBI అకౌంట్ హోల్డర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అలాగే ఇలాంటి నకిలీ ఇమెయిళ్ళ గురించి ప్రజలు తెలుసుకోవాలని హెచ్చరిస్తూ వినియోగదారులు వీటిపై క్లిక్ చేయకుండా ఉండాలని SBI తెలిపింది. బ్యాంక్ ఎప్పుడూ అలాంటి ఇమెయిల్‌లను పంపదని కూడా ప్రత్యేకంగా తెలిపింది.

 

SBI వినియోగదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు

SBI వినియోగదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులలో ఎవరైనా ఇలాంటి నకిలీ ఇమెయిల్‌లను పొందినట్లు అయితే కనుక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నివేదించాలని బ్యాంక్ తన వినియోగదారులను కోరింది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి వారు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కు ఒక లింక్‌ను కూడా అందించారు. SBI కస్టమర్లను అప్రమత్తం చేసింది. మీరు దాని మీద క్లిక్ చేసే ముందు ఆలోచించమని కోరింది.

బ్యాంకింగ్ అథారిటీ URL నకిలీ లింక్‌లు

బ్యాంకింగ్ అథారిటీ URL నకిలీ లింక్‌లు

వినియోగదారులు ఎవరైనా సరే ప్రత్యేకంగా ఏదైనా బ్యాంకింగ్ అథారిటీ నుండి లింక్‌ను అందుకున్నప్పుడల్లా వారు దానిని క్లిక్ చేసే ముందు URL ను అతి జాగ్రత్తగా తనిఖీ చేశారని నిర్ధారించుకోండి. నకిలీ మరియు హానికరమైన URL లు సాధారణంగా అక్షరదోషాలు మరియు ఆల్ఫాన్యూమరిక్ సంకేతాలను కలిగి ఉంటాయి. కావున మీరు జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే కనుక అవి స్పష్టంగా కనిపిస్తాయి. మీరు అలాంటి లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండడం అన్నిటికంటే శ్రేయస్కరం.

 

నకిలీ ఇమెయిళ్ళను గుర్తించే విధానం

నకిలీ ఇమెయిళ్ళను గుర్తించే విధానం

నకిలీ ఇమెయిళ్ళను గుర్తించడం కోసం మరొక మార్గం సాపేక్షమైన ఫూల్ ప్రూఫ్ మార్గం. అంటే మెయిల్ పంపిన ఇమెయిల్ చిరునామాను చూడటం. ఈ ఇమెయిల్ చిరునామాలు ధృవీకరించబడిన మరియు అధీకృత ఇమెయిల్ ఐడిలతో సమానంగా కనిపిస్తాయి కాని మీరు జాగ్రత్తగా చూస్తే కనుక అందులో స్పెల్లింగ్ లోపాలు మరియు అక్షరదోషాలను గుర్తించవచ్చు. ఉదాహరణకు SBI యొక్క అధికారిక ఇమెయిల్ ID - [email protected] కావచ్చు. అయితే నకిలీ ఇమెయిల్‌లు - [email protected] ఐడి రూపంలో కలిగి ఉంటాయి.

 

Best Mobiles in India

English summary
SBI New Email Scam: Be Alert Customers Don't Open URL Links
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X