SBI యూజర్లు జాగ్రత్త!! ఈ SMS స్కామ్ బారిన పడకండి...

|

ఆన్‌లైన్ మోసాల గురించి తరచుగా మనం వింటూనే ఉంటాము. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ యొక్క వాడకం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం రూ.10లు కూడా ఆన్‌లైన్ ద్వారా పంపడానికి సౌకర్యం కలిగి ఉంది. బ్యాంకుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ప్రతి ఒక్కరు కూడా తన యొక్క శాలరీ అకౌంట్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ని వినియోగిస్తున్నారు. వీరే కాకుండా జనాభాలో 60% మంది SBI లో అకౌంటును కలిగి ఉన్నారు. భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారుల కోసం ఒక హెచ్చరికను జారీచేసింది. ఆన్‌లైన్ పద్దతిలో స్కామర్లు యూజర్ల యొక్క అకౌంటుల నుండి డబ్బును దొంగిలించడానికి కొత్తగా SMS ను పంపడం చేస్తున్నారు. ఈ SBI SMS స్కామ్‌ను వివరిస్తూ PIB తన యొక్క ట్విట్టర్ అకౌంటులో ఒక ట్వీట్ ని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

SBI SMS కొత్త స్కామ్

SBI SMS కొత్త స్కామ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులను స్కామ్‌కు సంబందించిన SMSలు లేదా కాల్‌లకు ప్రతిస్పందించవద్దని PIB SBIని కోరింది. స్కామర్లు యూజర్లకు పంపే టెక్స్ట్ మెసేజ్‌లో షేర్ చేయబడిన ఏ లింక్‌ను కూడా క్లిక్ చేయవద్దని వారికి సూచించబడింది. స్కామర్‌లు తమ అకౌంటును తిరిగి యాక్టీవేట్ చేయడానికి వారి "వ్యక్తిగత" డాక్యుమెంట్లను సమర్పించడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయమని వినియోగదారులను కోరతారు. ఒకసారి మీరు ఆ లింక్‌పై నొక్కితే కనుక మీరు నకిలీ SBI వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు. తద్వారా మీరు ఫిషింగ్ బాధితులవ్వడంతో స్కామర్‌లకు మీ అకౌంట్ నుండి మీ డబ్బును దొంగిలించడానికి అనుమతిస్తుంది.

SBI SMS స్కామ్ మెసేజ్

"ప్రియమైన A/c హోల్డర్ SBI బ్యాంక్ డాక్యుమెంట్‌ల గడువు ముగిసింది కావున మీ యొక్క A/c బ్లాక్ చేయబడుతుంది. తిరిగి యాక్టీవేట్ చేయడం కోసం http://sbikvs.II నెట్‌బ్యాంకింగ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా అప్‌డేట్ చేయండి." సారాంశంతో స్కామర్‌లు యూజర్లకు SMS ని పంపుతారు. ముఖ్యంగా మీరు అలాంటి మెసేజ్లపై ప్రత్యేకమైన శ్రద్ధవహించి గమనిస్తే కనుక అది నకిలీదో కాదో మీరు సులభంగా గుర్తించగలరు. స్కామర్‌లు పంపే మెసేజ్ లో వ్యాకరణ దోషాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది స్కామ్ అని గుర్తించడానికి మొదటి ఎంపిక అవుతుంది.

SBI
 

SBI బ్యాంక్ గత నెలలో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ ప్రకారం "యూజర్ ID/ పాస్‌వర్డ్/ డెబిట్ కార్డ్ నంబర్/ PIN/ CVV/ OTP వంటి మొదలైన యూజర్ల యొక్క వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడిగే ఇమెయిల్‌లు/ SMS/ కాల్‌లు/ఎంబెడెడ్ లింక్‌లకు ప్రతిస్పందించవద్దని మా వినియోగదారులందరికీ సూచిస్తున్నాము. బ్యాంక్ ఇటువంటి సమాచారాన్ని ఎప్పుడూ అడగదు అని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. కస్టమర్‌లు అటువంటి ఫిషింగ్/స్మిషింగ్/విషింగ్ ప్రయత్నాలను ఇమెయిల్ ద్వారా report.phishing@sbi.co.inకి నివేదించవచ్చు. అంతేకాకుండా చర్యలను తీసుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సంప్రదించవచ్చు. ఈ సంఘటనలను నివేదించడానికి వారు స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీని కూడా సంప్రదించవచ్చు.

SBI బ్యాంక్

SBI బ్యాంక్ అటువంటి టెక్స్ట్ మెసేజ్లను పంపదని SBI వినియోగదారులందరూ కూడా ముందుగా తెలుసుకోవాలి. బ్యాంక్ యొక్క అధికారిక సైట్ ప్రకారం "కస్టమర్ వక్తిగత సమాచారాన్ని పొందడానికి SBI ఎప్పుడూ ఇమెయిల్ పంపదు. మీ వినియోగదారు పేరు లేదా పిన్ పాస్‌వర్డ్ లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి SBI ద్వారా ఉద్భవించినట్లు భావించబడే ఏదైనా ఇ-మెయిల్‌ను మీరు స్వీకరించినట్లయితే కనుక దయచేసి వెంటనే SBIకి నివేదించండి. ఇది ఖచ్చితంగా ఫిషింగ్ మెయిల్ కావచ్చు."

Best Mobiles in India

English summary
SBI SMS Scam: Beware SBI Users Do not Fall Victim to This New SMS Scam

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X