ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ దారులకు హెచ్చరిక

దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సరికొత్త హెచ్చరికలను జారీ చేసింది.

|

దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సరికొత్త హెచ్చరికలను జారీ చేసింది. ఖాతాదారులంతా కొత్త ఏటీఎం కార్డులు తీసుకోవాలంటోంది.ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్‌ స్ట్రైప్‌ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని సూచించింది. మోసాలు, కార్డ్ క్లోనింగ్‌కు చెక్ పెడుతూ.. కస్టమర్లకు డబ్బుకు భద్రత ఇవ్వడంతో పాటూ.. ఇటు ఆర్బీఐ నుంచి ఆదేశాలు రావడంతో ఈ చిప్ కార్డుల్ని ఇవ్వాలని నిర్ణయించామంటున్నారు బ్యాంక్‌ అధికారులు.

మొబైల్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండిమొబైల్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

కొత్త కార్డుల జారీకి ..

కొత్త కార్డుల జారీకి ..

ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

ఈఎంవీ

ఈఎంవీ

నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) చిప్‌ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది.

స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ..

స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ..

ఈ కార్డులో ఉండే చిప్ ద్వారా.. స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ఒకవేళ పొరపాటున కార్డు పోయినా.. చోరీ చేసినా కస్టమర్లు డబ్బుకు రక్షణ ఉండేలా రూపొందించామంటున్నారు అధికారులు.

డిసెంబర్‌ 31లోపు
 

డిసెంబర్‌ 31లోపు

డిసెంబర్‌ 31లోపు అందరూ కార్డులకు మారాలని పాత కార్డులు ఆ తరువాత నుంచి చెల్లవని SBi తెలిపింది.

జూన్‌ ఆఖరు నాటికి

జూన్‌ ఆఖరు నాటికి

జూన్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐ 28.9 కోట్ల ఏటీఎం-డెబిట్‌ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్‌ ఆధారితమైనవే.

కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం

కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం

కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం హోమ్‌ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది.

మోసాలబారిన పడకుండా ..

మోసాలబారిన పడకుండా ..

ఏటీఎం కార్డులకు సంబంధించిన మోసాలబారిన పడకుండా ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కేవలం చిప్‌ ఆధారిత, పిన్‌ నంబర్‌ ఆధారిత డెబిట్, క్రెడిట్‌ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించడం తెలిసిందే.

Best Mobiles in India

English summary
SBI to customers Switch to chip based debit cards by Dec 31 more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X