కస్టమర్ల కి జాగ్రత్తలు ! వైఫై వాడవద్దంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

By Gizbot Bureau
|

దేశీయ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు పబ్లిక్ వై-ఫై వినియోగంపై ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తూ వస్తున్న విషయం విదితమే. పబ్లిక్ వైఫై సర్వీసుతో బ్యాంకు అకౌంట్లను లాగిన్ కావొద్దని గట్టిగా హెచ్చరిస్తోంది.ఆయా వెబ్ సైట్లోకి వెళ్లి లింకులు క్లిక్ చేయడం ద్వారా మాల్ వేర్ మీ డివైజ్ ల్లోకి చేరి మీ పర్సనల్ డేటాను క్యాప్చర్ చేసే ముప్పు ఉందని తెలిపింది.

అకౌంట్ వివరాలు
 

అకౌంట్ వివరాలు

బ్యాంకు అధికారులమంటూ ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పమని లేదంటే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని భయపెడతారు. తొందరపడి చెప్పకండి. వారు చెప్పింది నమ్మి మీ వివరాలు ఇచ్చారంటే.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. ఏటీఎం కార్డు నెంబర్ లేదా 4 అంకెల పిన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, CVV నెంబర్ ఇలాంటివి ఏవీ చెప్పకూడదు.

వ్యక్తిగత వివరాలు

వ్యక్తిగత వివరాలు

ఏ బ్యాంకు అధికారి కూడా కస్టమర్ కు ప్రత్యేకించి ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలను అడగరని గుర్తించుకోండి. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్ వివరాల్లో పాస్ వర్డ్, ఏటీఎం కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ ఫోన్లో సేవ్ చేసుకోవద్దు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు మాత్రమే మీ డెబిట్ కార్డుతో మనీ విత్ డ్రా చేసుకోండి.

క్రెడిట్ కార్డు వివరాలు

క్రెడిట్ కార్డు వివరాలు

అపరిచితులకు మీ కార్డును ఇవ్వొద్దు. క్రెడిట్ కార్డు వివరాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయకండి. ఇలా చేస్తే మీకు తెలియకుండానే మీ అకౌంట్ల నుంచి మోసగాళ్లు డబ్బులు కాజేస్తారని మరవకండి. సో.. బీఅలర్ట్.. మీ డబ్బుకు మీరే బాధ్యులు.. డబ్బులు పోయాక ఎవరిని నిందించినా ఫలితం ఉండదు.

పబ్లిక్ వైఫై నెట్ వర్క్ 
 

పబ్లిక్ వైఫై నెట్ వర్క్ 

బ్యాంకింగ్ లావాదేవీలకు పబ్లిక్ వైఫై నెట్ వర్క్ వాడొద్దు. సాధారణ బ్రౌజింగ్ కోసం వాడితే పర్వాలేదు.. కానీ, పబ్లిక్ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు అకౌంట్లలో లాగిన్ కావొద్దు. ఇలా చేయడం వల్ల మీ బ్యాంకు అకౌంట్ వివరాలు వైఫై ప్రొవైడ్ చేసేవారికి ఈజీగా తెలిసిపోతాయి. వెబ్ ఇంటర్ ఫేస్ నుంచి సులభంగా సెర్చ్ చేసినవారి వివరాలు వారికి చేరుతాయి. అనుమానాస్పద వెబ్ సైట్లను ఓపెన్ చేయకపోవడమే మంచిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
SBI Users BEWARE! Avoid this activity to save big money loss

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X