SBI ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. ఇక వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవ‌లు!

|

భార‌త‌దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) త‌మ యూజ‌ర్ల‌కు మెరుగైన సేవ‌లందించే దిశ‌గా మ‌రో ముంద‌డుగు వేసింది. Whatsapp ద్వారా బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందించ‌డాన్ని ప్రారంభించింది. ఈ నిర్ణ‌యం ద్వారా చాలా మంది ఎస్‌బీఐ యూజ‌ర్ల‌కు మేలు చేకూర‌నుంది. ఏటీఎం కేంద్రానికి వెళ్ల‌కుండా, యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే ప‌ని లేకుండా బ్యాంకింగ్ సేవ‌ల్ని పొంద‌వ‌చ్చు. ఈ మేర‌కు వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల గురించి ఎస్‌బీఐ సంస్థ ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది.

 
SBI ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. ఇక వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవ‌లు!

ఈ SBI వాట్సాప్ బ్యాంకింగ్ స‌ర్వీసెస్ ద్వారా యూజ‌ర్లు వాట్సాప్‌లోనే బ్యాలెన్స్ త‌నిఖీ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేకాకుండా మినీ స్టేట్‌మెంట్ కూడా పొంద‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ పేర్కొంది. Whatsapp లో SBI బ్యాంకింగ్ సేవను పొందడానికి, మీరు మీ ఖాతాను నమోదు లేదా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవ‌ల కోసం మీ సమ్మతిని నమోదు చేయడానికి, మీరు SBIలో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ నుండి "WAREG (SPACE) A/c (ఖాతా నంబ‌ర్‌)" ను టైప్ చేసి +91 7208933148కి SMS ద్వారా పంపాలి. ఆ త‌ర్వాత మీరు ఇచ్చిన వివ‌రాలు స‌రైన‌వి అయితే.. ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్‌కు ఎస్‌బీఐకి చెందిన +91 9022690226 నంబ‌ర్ నుంచి రిజిస్ట్రేష‌న్‌ విజ‌య‌వంతం అయిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది.

ఇప్పుడు Whatsapp బ్యాంకింగ్ సేవ‌ల్ని ఎలా వినియోగించుకోవాలో చూద్దాం:
మీకు రిజిస్ట్రేష‌న్ విజ‌య‌వంత‌మైన‌ట్లు వాట్సాప్‌లో ఎస్‌బీఐ నుంచి మెసేజ్ వ‌చ్చిన +91 9022690226 నంబ‌ర్‌కు అదే చాట్‌లో "Hi" అని మెసేజ్ పంపాలి. అప్పుడు మీకు చాట్‌లోనే బ‌దులుగా "Dear customer, You are successfully registered for SBI WhatsApp Banking services " మెసేజ్ వ‌స్తుంది. అనంత‌రం కింద పేర్కొన్న విధంగా ప‌లు ఆప్ష‌న్ల‌ను మీ ముందు ఉంచి ఏది కావాలో ఎంపిక చేసుకోమ‌ని కోరుతుంది.
* ఖాతా బ్యాలెన్స్‌
* మినీ స్టేట్‌మెంట్‌
* డీ రిజిస్ట‌ర్ ఫ్రం వాట్సాప్ బ్యాంకింగ్‌

ఇలా వ‌చ్చిన ఆప్ష‌న్ల‌లో మీకు కావాల్సిన ఆప్ష‌న్‌ను బ‌దులిస్తే స‌మాధానం బ‌దులు వ‌స్తుంది. మీ ఖాతా లో బ్యాలెన్స్ తెలుసుకోవాల‌నుకుంటే మొద‌టి ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక‌వేళ మీరు డి-రిజిస్టర్ చేయాలనుకుంటే, మీరు మూడవ ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

SBI ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. ఇక వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవ‌లు!

ఇది కాకుండా, SBI తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు WhatsApp సేవలను కూడా అందిస్తుంది. ఎస్‌బిఐ కార్డ్ వాట్సాప్ కనెక్ట్ పేరుతో, వినియోగదారులు వాట్సాప్‌లో బ్యాంక్‌కి కనెక్ట్ అవ్వవచ్చు మరియు వారి ఖాతా స‌మాచారం, బాకీ ఉన్న బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్‌లు, కార్డ్ చెల్లింపులు మరియు మరిన్నింటిని తెలుసుకోవచ్చు. అవసరమైన సమాచారాన్ని పొందడానికి, వినియోగదారులు వాట్సాప్‌లో 'OPTIN' అని టైప్ చేసి 9004022022 నంబ‌ర్‌కు మెసేజ్ పంపాలి. ఈ సేవల‌ కోసం నమోదు చేసుకోవడానికి, SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 8080945040కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాగా, ఇప్ప‌టికే ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ త‌మ యూజ‌ర్ల‌కు ఈ త‌రహా సేవ‌ల్ని అందిస్తున్నాయి.

 

ఇప్పుడు SBI YONO యాప్‌లో లబ్ధిదారులను జోడించే విధానం తెలుసుకుందాం:
ముందుగా మీ యొక్క ఫోన్ లో SBI YONO యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసినట్లు నిర్ధారించుకోండి. తర్వాత కింద తెలిపే దశలను అనుసరించండి.
(గమనిక: SBI యోనో మరియు SBI యోనో లైట్ యాప్‌లు రెండూ ఒకేలా ఉంటాయి. అయితే లైట్ యాప్ కొన్ని ఫీచర్లు లేని లోయర్-ఎండ్ పరికరాల కోసం మాత్రమే.)

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI YONO యాప్‌ని ఓపెన్ చేయండి.
2. మీ MPIN లేదా 'యూజర్ నేమ్' మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి యాప్‌ని లాగిన్ చేయండి.
3. ఇప్పుడు 'YONO pay ' ఎంపికపై ట్యాప్ చేయండి > బ్యాంక్ అకౌంటుపై నొక్కండి. (YONO లైట్ వినియోగదారులు 'ఫండ్ ట్రాన్స్‌ఫర్' ఎంపికపై క్లిక్ చేయండి.)

SBI ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌.. ఇక వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవ‌లు!

4. 'యాడ్/మేనేజ్ బెనిఫిషియరీ' ఎంపికపై నొక్కండి. 5. మీరు ముందుకు కొనసాగించడానికి మీ 'SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్'ని మళ్లీ జోడించాలి. మీరు అలా చేసిన తర్వాత 'సబ్మిట్' ఎంపికపై క్లిక్ చేయండి.
6. ఇప్పుడు లబ్ధిదారుని జోడించడానికి మీరు అతనికి చేసే పేమెంట్ ప్రక్రియ ద్వారా వెళ్లాలి. కాబట్టి దీనిని ప్రారంభించడానికి మీరు లబ్ధిదారు రకాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం 'సెలెక్ట్ బెనిఫిషియరీ టైప్' డ్రాప్-డౌన్ బటన్‌పై నొక్కండి.
7. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంక్ అకౌంటుల మధ్య ఎంచుకోండి మరియు కొనసాగండి. 8. తరువాత ట్రాన్సఫర్ పరిమితి ఎంపికలో లబ్ధిదారుని అకౌంట్ యొక్క అన్ని వివరాలను జోడించండి. యాప్ లో మీకు చూపే గరిష్ట పరిమితిని ఎంచుకోండి. ఉదాహరణకు: రూ.10,00,000 ఎంపికను ఎంచుకొని తరువాత 'నెక్స్ట్' ఎంపిక మీద నొక్కండి. ఇప్పుడు మీరు ఈ లబ్ధిదారుని అకౌంటుకు కొంత మొత్తాన్ని పంపవలసి ఉంటుంది. మీరు రూ.1 ఎంచుకొని పే బటన్‌పై నొక్కండి.
9. తరువాత నిర్ధారణ కోసం OTP ని టైప్ చేయమని మీకు చెబుతుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఇప్పుడే అందుకున్న OTPని జోడించి, నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.
10. ఇప్పుడు 24 గంటలలోపు మీ లబ్ధిదారుని అకౌంట్ SBI యోనో/SBI యోనో లైట్ యాప్‌కి జోడించబడుతుంది.

Best Mobiles in India

English summary
SBI WhatsApp Banking Service; Check Account Balance, Get Mini Statement

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X