Home
News

SBI YONO app పనిచేయడం లేదు, ఓసారి చెక్ చేసుకోండి

By Gizbot Bureau

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యోనో యాప్ జూలై 22న డౌన్ అయింది. యోనో యాప్‌కు లాగిన్ అవలేకపోతున్నామని పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేసారు. స్మార్ట్‌ ఫోన్‌లో సేవలు ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ యాప్ యోనో కూడా పనిచేయటంలేదని కస్టమర్లు వాపోతున్నారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోను ఈ అంశంపై స్పందించారు.

SBI YONO app down since morning, customers take to Twitter to lodge grievances

కస్టమర్ల ఫిర్యాదుల కొరకు ట్విట్టర్ ను ఆశ్రయించడంతో ఎస్‌బీఐ ట్విట్టర్‌ అకౌంట్ కంప్లైంట్ లతో నిండిపోయింది. ఎస్బీఐ డిజిటల్ సేవా వేదిక యోనోకు (You Only Need One-YONO) ఆండ్రాయిడ్, ఐవోఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్స్ ద్వారా యాక్సెస్ కావొచ్చు. అయితే ఈ రోజు యోనో యాప్‌తో పాటు నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కూడా డౌన్ అయిందని కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. అయితే సాయంత్రానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లుగా కనిపించింది.

 యోనో యాప్

యోనో యాప్

యోనో యాప్‌తో పాటు ఎస్బీఐ పోర్టల్ పైన పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి ఈ సేవలు డౌన్ అయ్యాయని ట్విట్టర్‌‍లో పేర్కొంటున్నారు. ఈ బ్లాకవుట్ పైన ఎస్బీఐ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అయితే యోనో యాప్ ఆ తర్వాత సాయంత్రం మాత్రం ఓపెన్ అయింది. కొన్నిసార్లు చాలా స్లోగా ఓపెన్ అయింది.

సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ

సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ

డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న సమయంలో వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సేవలు నిలిచిపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఖాతాదారులంతా ఫిర్యాదుల కొరకు సోషల్ మీడియాను ఆశ్రయించడంతో ఎస్బీఐ ట్విట్టర్‌ ఖాతా ఫిర్యాదులతో నిండిపోయింది.

 వెల్లువెత్తిన ఫిర్యాదులు

వెల్లువెత్తిన ఫిర్యాదులు

ఎస్పీఐ నెట్ వర్క్ అంతా డౌన్ అయిందని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్‌కు యాక్సెస్ కాలేకపోతున్నామని శుభమ్ జాదవ్ అనే కస్టమర్ ఫిర్యాదు చేశారు. సాధారణంగా సోమవారం రోజు ఎస్బీఐ నెట్ వర్క్ డౌన్ అవుతుందని, ఇలా ఎందుకు జరుగుతోందని, మేం ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ పైన ఆధారపడుతున్నామని, ఎస్బీఐ యోనో అలాగే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వర్క్ కావడం లేదని రితిక్ సురానా అనే మరో నెటిజన్ ఫిర్యాదు చేశారు. ఇలా పలువురు ఫిర్యాదులు చేశారు.

SBI Internet Banking: రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

SBI Internet Banking: రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

ముందుగా www.onlinesbi.com ఓపెన్ చేయండి.'New User Activation/Registration' పైన క్లిక్ చేయండి. మీరు బ్రాంచ్‌లో నెట్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే OK పైన క్లిక్ చేయండి. 'New User Registration' క్లిక్ చేసి 'Next' పైన క్లిక్ చేయాలి.

  ప్రాసెస్ కంటిన్యూ

ప్రాసెస్ కంటిన్యూ

మీ అకౌంట్ నెంబర్, సీఐఎఫ్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ కోడ్ లాంటి వివరాలు ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ బ్యాంక్ పాస్‌బుక్ పైన ఉంటాయి.నెట్‌ బ్యాంకింగ్‌లో ఎలాంటి సేవలు కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Confirm పైన క్లిక్ చేయాలి.

ప్రాసెస్ కంటిన్యూ

ప్రాసెస్ కంటిన్యూ

'I have my ATM card' సెలెక్ట్ చేసుకొని కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. మీకు తాత్కాలిక యూజర్ నేమ్ వస్తుంది. దాంతో లాగిన్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్త యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నియమనిబంధనలన్నీ చదివి చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీ లాగిన్ పాస్‌వర్డ్, ప్రొఫైల్ పాస్‌వర్డ్ వేర్వేరుగా క్రియేట్ చేయాలి. సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని జవాబు ఎంటర్ చేయాలి. మీరు పాస్‌‌వర్డ్ మర్చిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. మీ పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, దేశం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
SBI YONO app down since morning, customers take to Twitter to lodge grievances
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X