ఇక్కడ నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేస్తే ఖేల్ ఖతం

|

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. ఒకే రకమైన మోసాన్ని రకరకాలుగా చేస్తున్నారు. సైబర్‌ నేరాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్న విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి.. బమ్మిని తిమ్మిని చేసి తమకు కావాల్సిన సమాచారం తెలుసుకుంటున్నారు.

Scammers are Robbing People by Different Ways

ఆ తర్వాత క్షణాల్లోనే బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మును ఖాళీచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఇప్పుడు మరో తరహాల మోసానికి పాల్పడుతున్నారు.

ఐటీ శాఖ అధికారులమంటూ:

ఐటీ శాఖ అధికారులమంటూ:

తెలియని నంబర్ల నుంచి కాల్ చేసి బ్యాంకు, ఐటీ శాఖ అధికారులమంటూ నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ట్యాక్స్ చెల్లించాలంటూ ఫోన్ కాల్స్ చేయడం, తాము చెప్పినట్టుగా ట్యాక్స్ పేమెంట్ చేస్తే రీఫండ్ అమౌంట్ క్రెడిట్ అవుతుందని మాయ చేస్తున్నారు. ఫోన్లకు SMSలు పంపడం.. లేదా నేరుగా ఫోన్ కాల్ చేసి మాటల్లో పెడుతుంటారు. తద్వారా వారి బుట్టలో పడిన అమాయకుల అకౌంట్ల నుంచి డబ్బు మొత్తం మాయం చేస్తున్నారు.

SMSలో లింక్ క్లిక్ చేయొద్దు:

SMSలో లింక్ క్లిక్ చేయొద్దు:

దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లకు పంపిన SMS లింక్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. పొరపాటున క్లిక్ చేశారా? మీ వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నగదును కాజేస్తారు. పూణెకు చెందిన సెక్యూరిటీ కంపెనీ క్విక్ హీల్ టెక్నాలజీస్ ఈ విషయాన్ని గుర్తించింది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్‌ను సైబర్ స్కామ్‌లోకి లాగేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ హెచ్చరించింది. ట్యాక్స్ రిఫండ్ అప్రూవ్ అయినట్టు నమ్మిస్తూ పన్నుదారులకు SMS పంపిస్తారు. ఇలా వారిని ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది.

వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి:

వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి:

ఒకవేళ మీరు రాంగ్ బ్యాంకు నెంబర్ పెట్టినప్పటికీ కూడా ఎర్రర్ వచ్చిందని ఫిక్స్ చేసేందుకు మళ్లీ ధ్రువీకరించాల్సిందిగా అడుగుతారు. అచ్చం ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ మాదిరిగా ఉండే వెబ్ సైట్ క్రియేట్ చేసి యూజర్లను బురిడీ కొట్టిస్తారు. అది నమ్మి యూజర్లు.. తమ వ్యక్తిగత వివరాలను సదరు వెబ్ సైట్లలో ఎంటర్ చేస్తే.. మీరు ఇచ్చిన ప్రతిది అందులో రహస్యంగా స్టోర్ అవుతుంది. తద్వారా మీ అకౌంట్ హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్ల మాయలో పడకుండా మీ వివరాలు, మీ అకౌంట్ సెక్యూర్ ఉంచుకోవాలంటే ఈ కొన్ని జాగ్రత్తలను పాటించండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మీ ఫోన్‌కు పంపిన SMSలో గ్రామర్, స్పెల్లింగ్‌లో తప్పులు ఉన్నాయో చెక్ చేయండి. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్, PIN, OTP, PAN కార్డు నెంబర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. బ్యాంకు, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి కాల్ చేశారా? లేదో అన్నది ముందుగా నిర్థారించుకోండి. ఏదైనా అనుమానం వస్తే కాల్ కట్ చేయండి. ఫోన్‌కు ఏదైనా లింక్ పంపి క్లిక్ చేయమని అడిగితే దానిని అసలు క్లిక్ చేయకండి. అలాంటి లింకుల్లో హ్యాకర్లు మాల్ వేర్ వైరస్ కోడ్ రహస్యంగా ఉంచే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Scammers are Robbing People by Different Ways

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X