పోర్న్ చూసే యూజర్లే లక్ష్యంగా ఆన్‌లైన్‌లో రెచ్చిపోతున్న స్కామర్‌లు!! జాగ్రత్త
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా KYC మరియు OTPలకు సంబంధించినవి గతంలో కంటే చాలా వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ స్కామ్‌లు పెరగడానికి ప్రధాన కారణం వినియోగదారులు ఇంటర్నెట్‌పై ఎక్కువగా ఆధారపడటం. COVID-19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ మోసాలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

COVID-19 కారణంగా వినియోగదారులు చాలా మంది ఇంటి వద్ద ఉండి పనిచేయడంతో ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడపడం అలవాటుచేసుకున్నారు. ఇదే అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని స్కామర్‌లు గతంలో కంటే మరింత చురుకుగా మారారు. తాజా స్కామ్ లో భాగంగా పోర్న్ వీడియోలను చూసే వినియోగదారులకు "బ్రౌజర్ లాక్ చేయబడింది" అనే పాప్-అప్ చూపిస్తుంది. ఇంటర్నెట్ వినియోగదారులను మోసగించడానికి స్కామర్‌లు మళ్లీ ఉపయోగిస్తున్న పాత ట్రిక్ ఇది. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌ను చూడడం కొనసాగిస్తుంటే కనుక విస్తృతంగా వ్యాపించే ఈ స్కామ్ పట్ల జాగ్రత్త వహించండి.

పోర్న్ వీడియో కొత్త ఆన్‌లైన్ స్కామ్ వివరాలు
కొత్తగా వచ్చిన నివేదికల ప్రకారం పోర్న్ సైట్‌లను సందర్శించే వినియోగదారులు పోర్న్ వీడియోలను చూడటం కోసం తమ బ్రౌజర్ లాక్ చేయబడిందని పేర్కొంటూ నకిలీ పాప్-అప్ హెచ్చరికను అందుకుంటున్నారు. ఇటువంటి ఆన్‌లైన్ స్కామ్ గురించి వివరాలను ప్రముఖ ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా తన యొక్క ట్విట్టర్ అకౌంటులో పంచుకున్నారు. పాప్-అప్ బ్రౌజర్‌ను అన్‌లాక్ చేయడం కోసం డబ్బును చెల్లించాలని వినియోగదారులను అడుగుతోంది. దీన్ని మరింత వాస్తవికంగా చేయడానికి స్కామర్‌లు చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి కనిపించే విధంగా పాప్-అప్‌ను రూపొందించారు.

డిక్రీ నంబర్ 173-279 కింద కంప్యూటర్ "బ్లాక్ చేయబడింది" అని పాప్-అప్ పేర్కొంటుంది. "భారతదేశం చట్టంచే నిషేధించబడిన మెటీరియల్‌లను వీక్షించడం మరియు వ్యాప్తి చేయడం" కారణంగా బ్రౌజర్ లాక్ చేయబడిందని ఇది పేర్కొంది. వినియోగదారులు 6 గంటలలోపు పెనాల్టీని చెల్లించకపోతే పేర్కొన్న కంప్యూటర్‌కు సంబంధించిన కేస్ మెటీరియల్స్ క్రిమినల్ ప్రొసీడింగ్‌ల కోసం మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడతాయని తెలుపుతూ ఒక హెచ్చరిక మెసేజ్ చూపుతుంది. టార్గెట్ చేసిన కంప్యూటర్లను అన్‌లాక్ చేయడానికి స్కామర్లు రూ.29,000 అడుగుతున్నారు. చెల్లింపు చేసిన వెంటనే బ్రౌజర్ అన్‌లాక్ చేయబడుతుందని ఒక మెసేజ్ ను జోడిస్తుంది. మీరు ఈ మెసేజ్ ను/పాప్-అప్‌ని స్వీకరించినట్లయితే కనుక ఇది నకిలీ స్కామ్ అని మరవకండి. అలాగే భారతదేశంలో పోర్న్ నిషేధించబడిందని కూడా గుర్తుంచుకోండి. అయితే ప్రభుత్వం ప్రజల కంప్యూటర్‌లను మరియు వారి కార్యకలాపాలను ఎప్పుడూ ట్రాక్ చేయదు.

పోర్న్ వీడియో మోసాల నుండి సురక్షితంగా ఉండే విధానం
** ఇటువంటి ఆన్‌లైన్ స్కామ్ ల బారిన పడకుండా ఉండాలంటే సాధారణంగా పోర్న్ చూడకుండా ఉండటమే అత్యంత ప్రాథమిక విషయం. అలాగే ఇది భారతదేశంలో నిషేధించబడింది కావున దీనిని చూడడం కూడా చట్టవిరుద్ధం.
** మీరు మీ బ్రౌజర్‌లో అటువంటి పాప్-అప్‌లను కనుగొంటే కనుక వెంటనే విండోను మూసివేయండి. అయినప్పటికీ అది పని చేయనట్లయితే మీ బ్రౌజర్ కోసం టాస్క్ మేనేజర్ మరియు ఎండ్ టాస్క్‌కి వెళ్లండి.
** చివరిగా మీ కంప్యూటర్ స్క్రీన్‌పై అటువంటి పాప్-అప్ కనిపిస్తే మీరు ఫోర్స్ షట్ డౌన్‌కి కూడా వెళ్లవచ్చు. వినియోగదారులను మోసగించడానికి మరియు వారి డబ్బును దొంగిలించడానికి స్కామర్లు ఉపయోగించే సాధారణ పద్ధతులు చాలానే ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి లింక్‌లు లేదా పాప్-అప్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.


Click it and Unblock the Notifications








