చైనాలో ప్రమాదాల నివారణకు టెక్నాలజీ

Posted By: Prashanth

చైనాలో ప్రమాదాల నివారణకు టెక్నాలజీ

 

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా దేశంలో నార్త్‌వెస్ట్ ఘన్షులో ఉన్న స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురి అవ్వుతుండడంతో అక్కడున్న ప్రభుత్వం స్కూలు పిల్లలను ప్రమాదాల నుండి రక్షించేందుకు గాను స్కూలు బస్సులలో జిపిఎస్ సిస్టమ్‌ని అమర్చాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2011లో జరిగిన స్కూలు బస్సు ప్రమాదం కారణంగా అకారణంగా 21 మంది పిల్లలు చనిపోయారు.

ఆ తర్వాత దీనిపై స్పందించిన ఎడ్యుకేషన్ ప్రతినిధులు, పోలీసు మరియు ట్రాఫిక్ సిబ్బంది అందరూ బస్సులను నడిపే డ్రైవర్లకు గాను సేప్టీ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. ఇక ఘన్షు ప్రాంతంలో పోయిన సంవత్సరం 1,505 ప్రమాదాలు జరిగాయి. దీంతో ప్రమాదాలను నివారించేందుకు గాను జిపిఎస్ ఫంక్షనాలిటీని అక్కడున్న బస్సులలో నిక్షిప్తం చేసారు. జిపిఎస్‌ని ముఖ్యంగా స్కూలు బస్సులలో తప్పనిసరి చేయడంతో ప్రమాదాలను చాలా వరకు కంట్రోల చేయవచ్చని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇవి మాత్రమే కాకుండా కెమికల్ లోడింగ్ వెహికల్స్, ఎక్కువ దూరం ప్రయాణించే బస్సులకు జిపిఎస్ సిస్టమ్‌ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot