ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వదంతుల పై ‘నిజనిర్థారణ’

|

మీ ఫేస్‌బుక్‌ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లలో ప్రచురితమయ్యే వార్తల్లో ఏది నిజమో..? ఏది వదంతో..? తేల్చుకోలేకపోతున్నారా!. అయితే మీ కోసం ఓ ప్రత్యేక ఫీచర్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది.

 
 ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వదంతుల పై  ‘నిజనిర్థారణ’

యూరోప్‌కు చెందిన పరిశోధకులు సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో వదంతులను పసిగట్టే ఓ లై డిటెక్టర్ వ్యవస్థను అభివృద్థి చేస్తున్నారు. ఫీమ్ ('Pheme') పేరుతో రూపకల్పన చేయబడుడుతున్న ఈ ఫీచర్ వేరువేరు సోర్సుల ఆధారంగా వదంతులను ముందుగానే పసిగట్టి నెటిజనులకు అప్రమత్తం చేస్తుందని షెఫిల్డ్ విశ్వవిద్యాలయం (బిటన్)కు చెందిన సీనియర్ పరిశోధకులు కలినా బొంచెవా(Kalina Boncheva) తెలిపారు.

5జీ నెట్‌వర్క్‌తో ఒక్క సెకనులో సినిమా మొత్తం డౌన్‌లోడ్!

త్వరలో.. పూర్తినిడివి గల సినిమాను ఒకేఒక సెకనులో డౌన్‌లోడ్ చేసుకోగలుగుతాం. ఇది వాస్తవం!. టెక్నాలజీ విభాగంలో అగ్రగామి దేశాల సరసన నిలిచిన దక్షిణ కొరియా $1.5బిలియన్ల వ్యయ ప్రణాళికతో 5వ తరం వైర్‌లెస్ (5జీ నెట్‌వర్క్‌ను) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధనలు జరపుతోంది. ఈ వేగవంతమైన వైర్‌లెస్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినట్లయితే పూర్తినిడివి గల సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 5జీ 1000 రెట్లు వేగవంతంగా స్పందిస్తుందని ఆ దేశపు సైన్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాము వృద్ధి చేస్తున్న 5జీ సర్వీసును 2017లో ట్రెయిల్ ప్రాదిపదికన విడుదల చేస్తామని, 2020 డిసెంబర్ నాటికి కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ కొరియా సైన్స్ వైజ్ఞానిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూరోప్, చైనా, యూఎస్ వంటి దేశాలు 5జీ టెక్నాలజీ వృద్ధి పై ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించాయి. భారత్ వంటి దేశాల్లో 4జీ ఇంటర్నెట్ సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవటం విశేషం.

టెక్నాలజీ విభాగంలో సరికొత్త సంచలనాల దిశగా దూసుకుపోతున్న సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మరో అత్యున్నత ఆవిష్కరణ వైపు అడుగులు వేస్తోంది. 5జీ హై-స్సీడ్ ఇంటర్నెట్ సర్వీసులను చేరువ‌చేసే సరికొత్త కోర్ టెక్నాలజీని వృద్థిచేస్తున్నట్లు సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ 5జీ మొబైల్ కమ్యూనికేషన్స్ సేవలు 2020 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

పరీక్షల్లో భాగంగా ఈ ఆధునిక టెక్నాలజీ ఇంటర్నెట్ సర్వీస్ 1జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. సామ్‌సంగ్ వృద్థిచేస్తున్న 5జీ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉన్న 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే వందల రెట్లు వేగవంతంగా స్పందించగలదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X