మన భవిష్యత్ రోడ్లు ఇవే!

By Sivanjaneyulu
|

రోడ్లు పొడుగూతా స్ట్రీట్ లైట్‌లను ఏర్పాటు చేయాలంటే బోలెడంత డబ్బును ఖర్చు చేయవల్సి ఉంటుంది. ఈ లైట్లను వెలిగించేందుకు అపరిమితైన విద్యుత్ అవసరమవుతుంది. ఈ సమస్యకు మెక్సికో శాస్రవేత్తలు చక్కటి పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. విద్యుత్ అవసరం లేకుండా మెరుమెట్లు గొలిపే లైట్ ఎమిటింగ్ సిమెంట్‌ను వీరు సృష్టించగలిగారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం...

Read More : 6జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్‌, రూ.11,999 నుంచి

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

సోలార్ పవర్ సిమెంటుతో ఏర్పాటు చేసే రోడ్లు పగటిపూట సోలార్ విద్యుత్‌ను గ్రహించుకుని రాత్రి వేళల్లో కాంతులను వెదజల్లుతాయి.

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

ప్రస్తతం రోడ్ల పై వాడుతోన్న రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కొద్ది కాలం మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోతున్నాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ లైట్ ఎమిటింగ్ సిమెంట్ మాత్రం వందల ఏళ్లు అయినా తన కాంతిని కోల్పోదు.

 మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

సోలార్ పవర్ సిమెంటుతో నిర్మించబడే రోడ్లు ఆకుపచ్చ ఇంకా నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంటులో ఉండే జెల్ తరహా పదార్థం పగటి పూట గ్రహించుకునే సోలార్ శక్తి ద్వారా 12 గంటల పాటు వెలుతురును అందించగలదు.

 మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

సోలార్ పవర్ సిమెంటులో ఉండే జెల్ తరహా పదార్థం పగటి పూట గ్రహించుకునే సోలార్ శక్తి ద్వారా 12 గంటల పాటు వెలుతురును అందించగలదు.

 

 మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన మికోకెన్స్ యూనివర్శిటీ సైంటిస్ట్ జోస్ కార్లోస్ రుబియో అనేక పరిశోధనల తరువాత విద్యుత్ అవసరం లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే ఈ కొత్త రకం సోలార్ సిమెంట్‌ను సృష్టించగలిగారు.

 మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

ఈ సిమెంటుతో నిర్మితమయ్యే రోడ్ల పై స్ట్రీట్ లైట్స్ అవసరం లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

దుమ్ము, ధూళి కారణంగా ఈ రోడ్ల పై కాంతికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా ఉండేదుకు ఈ సోలార్ పవర్ సిమెంటులో ప్రత్యేకమైన క్రిస్టల్స్‌ను కూడా వినియోగించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

ఈ ఇకో ఫ్రెండ్లీ రోడ్లు పర్యావరణానికి పూర్తిగా అనుకూలం కావటంతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకురావాలని రిసెర్చర్ల బృందం భావిస్తోంది. తమ ప్రయోగానికి పేటెంట్ లభించిన వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కునుందని రుబియో తెలిపారు.

మన భవిష్యత్ రోడ్లు ఇవే!

సోలార్ లైట్ ఎమిటింగ్ సిమెంట్‌ పై నిర్మించిన రోడ్లకు సంబంధించి రూపొందించిన ప్రత్యేకమైన వీడియో..

Best Mobiles in India

English summary
Scientists Created Solar Powered Cement That Can Light Up Roads. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X