సోషల్ మీడియా నాకు జీవితాన్ని ప్రసాదించింది..: అమిత్ గుప్తా

Posted By: Prashanth

సోషల్ మీడియా నాకు జీవితాన్ని ప్రసాదించింది..: అమిత్ గుప్తా

 

సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు తమవంతు సామాజిక న్యాయాన్ని కూడా ప్రపంచంలో ఉన్న జనాభాకు అందజేస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు సామాజిక న్యాయం ఎలా చేస్తాయని అనుకుంటున్నారా.. దీనికి ఉదాహారణగా ఓ చిన్న స్టోరీ చెబుతాను. దక్షణ ఆసియాకు చెందిన ఆశావాది, డిజైనర్ అయిన అమిత్ గుప్తా గత కొంతకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీనికి గాను అమిత్ గుప్తా గత అక్టోబర్‌లో తనకు ఎముక మూల మార్పిడి కోసం ఎవరైనా దాత కావాలని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు.

అమిత్ గుప్తాకి కావాల్సిన దాత కూడా దక్షణ ఆసియాకు చెంది ఉంటే అతనికి ఎముక మార్పిడి చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఈ వార్త మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని మూలలకు పాకింది. చివరకు ఏమవుతుంది అమిత్ గుప్తాకు కావాల్సిన దాతను వెతికి మరి తెచ్చింది. తన ఎముక మార్పిడి కోసం కావాల్సిన దాత దొరికాడంటూ స్వయంగా అమిత్ గుప్తా తన ట్విట్టర్ ఎకౌంట్‌(@superamit)లో పేర్కోనడం విశేషం.

ఈ చిన్న ఉదాహారణ ద్వారా పాఠకులు అర్దం చేసుకోవాల్సింది ఏమిటంటే, సామాజిక వెబ్‌సైట్స్ వచ్చిన తర్వాత తమ దైన శైలిలో గ్లోబల్‌గా ప్రపంచ కమ్యూనిటీని కలపడమే కాకుండా ఇలాంటి మంచి పనులకు కూడా ఉపయోగపడుతున్నాయి. కేవలం ఒక్క ట్విట్టర్ మాత్రమే కాకుండా, గతంలో ఫేస్‌బుక్ కూడా తప్పి పోయిన ఓ తల్లి దండ్రుల బిడ్డని వెతకడంతో తొడ్పడిన విషయం మనకు తెలిసిందే.

అమిత్ గుప్తా తన బ్లాగులో తన ఆనందాన్ని ఈ క్రింది విధంగా తెలియజేశాడు.

… After over 100 drives organized by friends, family, and strangers, celebrity call-outs, a bazillion reblogs (7000+!), tweets, and Facebook posts, press, fundraising and international drives organized by tireless friends, and a couple painful false starts, I’ve got a 10/10 matched donor!

You all literally helped save my life. (And the lives of many others.)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot