భూతల్లిని ముద్దాడి ఎన్ని రోజులయింది : అసలైన సూర్యోదయం ఇదే !

Written By:

ఈ నేలని ముద్దాడి ఎన్ని రోజులయింది...ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసి ఇంకెన్ని రోజులయింది..ఇవి అంతరిక్షం నుంచి రాగానే స్కాట్ కెళ్లి మదిలో మొదలిన ఆలోచనలు.. సంవత్సరం రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన స్కాట్ కెల్లీ అలాగే మరో వ్యోమగామి మిఖాయెల్ లు సురక్షితంగా భూమి మీదకు వచ్చారు. సంవత్సర కాలం తరువాత వారు భూమికి చేరుకున్నారు. ఆయన పరిస్థితి ఏంటీ...ఎలా ఉన్నారు. ఓ సారి తెలుసుకుందాం.

Read more : పింగ్ పాంగ్‌తో అంతరిక్షంలో 300 రోజులు: గేమ్ ఏంటంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా

అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా ఆధ్వర్యంలో పలు దేశాలు సంయుక్తంగా తలపెట్టిన మిషన్ టు మార్స్ ప్రయోగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్స్ యాత్రకు వెళ్లలాంటే వ్యోమగాలు సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా?

అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా? అందుకు వాతావరణం, శరీరం సహకరిస్తుందా? అనే కోణంలో చేపట్టిన ప్రయోగాలు .. స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియాంకోల రాకతో సఫలమైనట్లు తేటతెల్లమైంది.

మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో

మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములు స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియోంకోలు బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటిట్ లో బయలుదేరిన ఆ ఇద్దరూ కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద విజయవంతంగా భూమిపై పాదం మోపారు. అత్యధిక కాలం ఐఎస్ఎస్ లో గడిపిన రికార్డు వీరిద్దరే కావటం గమనార్హం.

ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో

స్కాట్, మిఖాయెల్ ల రాకతో నాసా సహా మిషన్ టు మార్స్ లో భాగస్వామ్యదేశాల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 340 రోజులపాటు అంతరీక్షంలో గడిపిన స్కాట్ .. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పోస్టులు పెట్టేవారు. వాటిని నెటిజన్లు కూడా అద్భుతంగా ఆదరించారు.

ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ

ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ స్కాట్ పెట్టిన పోస్టుకు విపరీతమైన స్సదన వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 27 న స్కాట్, మిఖాయెల్ లు అంతరీక్ష కేంద్రానికి వెళ్లారు. అప్పటినుంచి అక్కడే ఉన్నారు.దాదాపు 340 రోజులు అంతరిక్షంలో గడపడమంటే చాలా అసాధ్యంతో కూడుకున్న పని.

సోయేజ్ క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు

సోయేజ్ క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములు ఇవాళ ఉదయం కజకిస్తాన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. భూమిపై దిగగానే ముగ్గురు వ్యోమగాములకు ఫీల్డ్ టెస్టులు నిర్వహించారు.

రోదసిలోని విపత్కరణ వాతావరణం వ్యోమగాముల శరీరంపై

రోదసిలోని విపత్కరణ వాతావరణం వ్యోమగాముల శరీరంపై అనేక ప్రభావాలు చూపుతుంది. కండరాలు క్షీణిస్తాయి. నిద్రలేమి కలుగుతుంది. ఎముకలు బలహీనపడుతాయి. చూపు మందగిస్తుంది. రేడియేషన్ వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అంతే కాకుండా మెదడుపై తీవ్ర ప్రభావం

అంతే కాకుండా మెదడుపై తీవ్ర ప్రభావం పడే ఛాన్సుంది. శారీరకంగా బాగానే ఉన్నా .. కావాల్సిన వాళ్ల నుంచి దూరంగా ఉన్న కారణంగా ఆ బంధాల్ని కోల్పోయినట్లు భావన కలుగుతుందని ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీ అభిప్రాయపడ్డారు.

స్కాట్ కెల్లీని అమెరికాలోని హోస్టన్కు

కజకిస్తాన్లో దిగిన వ్యోమగామి స్కాట్ కెల్లీని అమెరికాలోని హోస్టన్కు తీసుకెళ్లనున్నారు. అక్కడ నాసా శాస్త్రవేత్తలు స్కాట్పై కొన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.

భూమి మీదకు వస్తూ స్కాట్ కెల్లీ అంతరిక్షంనుంచి సూర్యోదయాన్ని

భూమి మీదకు వస్తూ స్కాట్ కెల్లీ అంతరిక్షంనుంచి సూర్యోదయాన్ని తన కెమేరాలో బంధించి పంపాడు. భూమికి తిరిగి వచ్చే సమయంలో అంతరిక్షంలోనుంచి కనిపిస్తున్న సూర్యోదయాన్ని తుదిసారిగా ఫొటో తీశాడు కెల్లీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Astronauts Scott Kelly and Mikhail Kornienko return to Earth after a historic mission
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot