యాహు కొత్త 'సిఈవో' గా 'స్కాట్ థాంప్సన్'

Posted By:

యాహు కొత్త 'సిఈవో' గా 'స్కాట్ థాంప్సన్'

 

టెక్నాలజీ గెయింట్, ఇంటర్నెట్ కంపెనీ యాహు ఆన్‌లైన్ పేమెంట్ సర్వీస్ పే పాల్ విభాగానికి  మాజీ  ప్రెసిడెంట్‌గా భాద్యతలను అందించిన స్కాట్ థాంప్సన్‌ని కొత్త ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈవో) నియమించింది. గత నాలుగు నెలలుగా యాహు కంపెనీ సిఈవో భాద్యతలను నిర్వర్తించేందుకు తగిన వ్యక్తి కోసం గాలించగా చివరకు స్కాట్ థాంప్సనే ఆ పదవికి సరైన వ్యక్తి అంటూ అతనిని సిఈవోగా నియమించిందని బుధవారం జిన్హువా అధికారకంగా తెలిపారు.

యాహు కో ఫౌండర్, సిఈవో 'జెర్రీ యంగ్' నుండి జనవరి 2009వ సంవత్సరంలో భాద్యతలను స్వీకరించిన మాజీ సిఈవో 'క్యారోల్ బర్త్జ్' అర్దాంతరంగా సెప్టెంబర్ 6, 2011వ తేదీన సీఈవో పదవి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. తర్వాత ఆమె స్దానంలో కొత్త సిఈవో వచ్చే వరకు 42సంవత్సరాలు వయసు కలిగిన ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ తిమోతి మోర్స్ ఆ పదవి భాద్యతలను చేపట్టన విషయం తెలిసిందే.

కొత్త సీఈవో భాద్యతలను స్వీకరించిన 'స్కాట్ థాంప్సన్' మాట్లాడుతూ ఎంతో మంది మేధావులున్న యాహు కంపెనీ సిఈవోగా భాద్యతలు నిర్వర్తించడం చాలా గొప్ప విషయం. ఆన్ లైన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న యాహు కంపెనీ రాబోయే కాలంలో అభివృద్దికి నావంతు సహాకారం అందిస్తానని అన్నారు. యాహు కంపెనీకున్న అతి పెద్ద చరిత్రతో వినియోగదారులతో మరింత మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తామన్నారు.

స్కాట్ థాంప్సన్‌ని సిఈవో‌గా నియామకం చేసే సందర్బంలో గతంలో తాను పని చేసిన ఈబే విభాగానికి అందించిన సేవలకు గాను అతనిని కొనియాడారు. స్కాట్ థాంప్సన్‌ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలించినట్లేతే కస్టమర్ ఎంగేజ్‌మెంట్, గట్టి టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహానతో పాటు నైపుణ్యం వ్యక్తిగా కొనియాడారు. గతంలో స్కాట్ థాంప్సన్‌ 'పే పాల్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా తన సేవలను అందించాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot