తాజా రైల్వే సమాచారం కోసం ‘తథాస్త్’ యాప్

|

రైళ్ల రాకపోకల సమాచారాన్ని ప్రయాణీకులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో మరింత లైవ్లీగా తెలుసుకునేందుకు ‘తథాస్త్' పేరుతో సరికొత్త అప్లికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. తథాస్త్ యాప్ పూర్తి పేరు ‘ట్రెయిన్ అరైవల్ డిపార్చర్ అండ్ ఎమినిటీస్ ఎట్ స్టేషన్స్'. ఈ యాప్ ద్వారా రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారం, స్టేషన్‌లలో ఉన్న వసతులతో పాటు వివరాణత్మక స్టేషన్ లేఅవుట్‌లను ప్రయాణీకులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చూసుకోవచ్చు.

 తాజా రైల్వే సమాచారం కోసం ‘తథాస్త్’ యాప్

ప్రస్తుతం ఈ యాప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 25 ప్రధాన స్టేషన్‌లకు సంబంధంచిన సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ కొత్త యాప్ ద్వారా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, ఓంగోలు, అనకాపల్లి, భువనగిరి, భీమవరం టౌన్, గుంతకల్, చిత్తాపూర్, కడప, ఖమ్మం టౌన్, మంచిర్యాల, నాందేడ్, రామగుండం, తెనాలి, తాడేపల్లిగూడెం, వికారాబాద్, తాండూరు, సిర్పూర్ కాగజ్‌నగర్, సేదం స్టేషన్‌లకు సంబంధించిన లైవ్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ ఐట్యూన్స్ స్టోర్ నుంచి తథాస్త్ యాప్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
SCR Launches a Smartphone App, ‘TADAAST’. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X