టెక్నాలజీకి దూరంగా "టెక్ గురు"ల పిల్లలు, మరి బానిసైన వారి పరిస్థితేంటి ?

|

టెక్నాలజీ అమితవేగంతో పరుగులు తీస్తున్న నేటీ తరుణంలో ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలు స్మార్ట్‌ఫోన్లను జల్లెడ పట్టేస్తున్న విషయాలను మనం చూస్తూనే ఉన్నాం.స్మార్ట్‌ఫోన్ వారి చేతికిస్తే అందులో వారికేం కావాలో అన్ని నిమిషాల్లో ఒపెన్ చేసి పడేస్తుంటారు. గేమ్స్, సినిమాలు, వీడియోలు ఏవి ఎక్కడ ఉన్నాయో వారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇది కొన్ని సమస్యలకు దారితీసినా కాని పెద్దలు వారిని స్వేచ్చగా వదిలేస్తున్నారన్న విషయం సోషల్ మీడియాని బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే నూతన ఆవిష్కరణలతో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన 'టెక్‌ గురు'లు మాత్రం తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచారట.. నమ్మలేకున్నారా..అయితే ఈ న్యూస్ చదవాల్సిందే.

 

జియో రూ.448 ప్లాన్‌కి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్,సునీల్ మిట్టల్ జీవితంలో చీకటి కోణాలు !జియో రూ.448 ప్లాన్‌కి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్,సునీల్ మిట్టల్ జీవితంలో చీకటి కోణాలు !

బిల్‌గేట్స్

బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్‌ కంపెనీతో టెక్నాలజీని పరుగులు పెట్టించిన బిల్‌గేట్స్ తమ పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఏ టెక్నాలజీ కూడా వారి దగ్గరకు చేరకుండా ఆంక్షలు పెట్టారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గాడ్జెట్ల అతి వినియోగం వల్ల నిద్ర దూరమవుతుందని.. అరకొర నిద్రతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ఉన్నప్పుడు..

మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ఉన్నప్పుడు..

2007లో ఆయన మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ఉన్నప్పుడు ఈ ఆంక్షలు పెట్టానని తెలిపారు. పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు సెల్‌ఫోన్లు కూడా ఇవ్వలేదట. పిల్లలు కొంచెం పెద్దయ్యాక మాత్రం పరిమిత సమయం పాటు గాడ్జెట్లను ఉపయోగించేలా అవకాశమిచ్చారట. మిగతా సమయాన్ని పిల్లలు తమ మిత్రులు, బంధువులను కలిసేందుకు, హోంవర్క్‌ చేసేందుకు ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారట.

స్టీవ్స్‌జాబ్స్‌
 

స్టీవ్స్‌జాబ్స్‌

ఐఫోన్లు, ఐపాడ్స్‌ వంటి నూతన ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆవిష్కరించిన ఆపిల్‌ మాజీ సీఈవో, దివంగత టెక్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్‌ తమ పిల్లలను అసలు ఐపాడ్స్‌ను ఉపయోగించనివ్వలేదట. 2010లో కొత్తగా రూపొందించిన ఐపాడ్‌ను మీపిల్లలు ఇష్టపడ్డారా? అని ఓ విలేకరి స్టీవ్‌ను అడిగితే.. ‘వాళ్లు ఐపాడ్‌ను అస్సలు ఉపయోగించలేదు. ఇంటివద్ద పిల్లలు ఏ మేరకు టెక్నాలజీ ఉపయోగించాలనే దానిపై నియంత్రణ విధించామని సమాధానం ఇచ్చారు.

ఐపాడ్‌ల వినియోగాన్నే..

ఐపాడ్‌ల వినియోగాన్నే..

తమ ఇంట్లో ఐపాడ్‌ల వినియోగాన్నే నిషేధించుకున్నామని చెప్పడం స్టీవ్‌జాబ్స్‌ టెక్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్న వయసులోనే సాంకేతికత అతి వినియోగం వల్ల పిల్లల్లో తలెత్తే సమస్యలు, వారిపై చూపే ప్రభావాన్ని గుర్తించడమే దీనికి కారణమని విశ్లేషకులు చెప్పుకొచ్చారు

జోనాథాన్‌

జోనాథాన్‌

ఐపాడ్‌ డిజైన్‌లో పాలుపంచుకున్న జోనాథాన్‌ కూడా తమ పిల్లలకు ఐప్యాడ్ల వినియోగంపై నిబంధనలు విధించినట్టు చెప్పారు. పరిమిత సమయం మాత్రమే వాటిని వినియోగించాలని హోం వర్క్ కి అలాగే బంధువులకు ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పినట్లు ఆయన వివరించారు.

 టిమ్‌ కుక్‌

టిమ్‌ కుక్‌

ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్ కూడా తన 12 ఏళ్ల మేనల్లుడు సోషల్‌ మీడియాను ఉపయోగించడం ఇష్టం లేదని ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కూడా చెప్పారు. వారికి అసలు టెక్నాలజీ అంటేనే ఇష్టం లేదని బంధువులతో గడపడమే ఇష్టపడతారని తెలిపారు.

చాలామంది టెక్ గురులు ..

చాలామంది టెక్ గురులు ..

వీరితో పాటు ఇంకా చాలామంది టెక్ గురులు తమ పిల్లలను టెక్నాలజీకి అడిక్ట్ కాకుండా నియంత్రణ చేశారు. అయితే వారు తయారుచేసిన ఉత్పత్తులతో ఇతరుల పిల్లలు అడిక్ట్ కావడంలో భాగస్వామ్యం అయ్యారని, ఇది మీరు చేసిన తప్పని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Screen time v play time: what tech leaders won't let their own kids do More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X