లిస్టెడ్‌ కంపెనీలన్నీ అధికారిక వెబ్‌సైట్‌ను కలిగివుండాలి: సెబీ

Posted By: Super

లిస్టెడ్‌ కంపెనీలన్నీ అధికారిక వెబ్‌సైట్‌ను కలిగివుండాలి: సెబీ

న్యూఢిల్లీ: దేశంలోని లిస్టెడ్‌ కంపెనీలన్నీ అధికారిక వెబ్‌సైట్‌ను కలిగివుండాలని, దానిలో ప్రతిరోజూ పూర్తి స్థాయి సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తుండాలని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. వెబ్‌ అప్‌డేట్‌ తప్పనిసరి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని సెబీ ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. కంపెనీ ప్రాధమిక సమాచారం, ఆర్థిక స్థితిగతులు, షేర్‌హోల్డర్ల వివరాలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, కాంటాక్ట వివరాలు తదితర సమాచారాలతో మీడియా కంపెనీలతో కుదుర్చుకునే అగ్రిమెంట్ల గురించి వెల్లడించాలని తెలిపింది. ఈక్విటీ లిస్టింగ్‌ అగ్రిమెంట్‌కు మార్పులు చేపట్టడం ద్వారా కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలిపింది. వెబ్‌సైట్లలో వెల్లడించడంతో పాటు యధావిధిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకూ సమాచారం ఇవ్వాలని తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot