సుందర్ పిచాయ్ ఎమోషనల్ జర్నీ

Written By:

గూగుల్ ఉద్యోగులు మెచ్చిన అత్యుత్తమ సీఈఓగా సుందర్ పిచాయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైకు చెందిన సుందర్ పిచాయ్, గతేడాది ఆగష్ట్ లో గూగుల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా, బజ్‌ ఫీడ్ టెక్ రిపోర్టర్ Mat Honan చెన్నై నుంచి గూగుల్ వరకు సాగిన సుందర్ పిచాయ్ ఎమోషనల్ జర్నీకి అక్షర రూపాన్ని ఇచ్చారు. ప్రపంచపు రెండవ అత్యుత్తమ కంపెనీ అయిన గూగుల్‌‌కు సీఈఓగా వ్యవహరిసోన్న సుందర్ పిచాయ్‌కు మాట్ హోనన్ ప్రస్తావించిన పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌‌లో చూడొచ్పు..

Read More : ఇక డ్రైవింగ్ లైసెన్స్‌తో పనిలేదు.. ఫోన్ ఉంటే చాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చెన్నైలో జన్మించారు

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో జన్మించారు. ఇంజినీరింగ్‌ను IIT Kharagpurలో ఎంఎస్‌ను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, ఎంబీఏను వార్టన్ బిజినెస్ స్కూల్‌లో పూర్తి చేసారు.

5 పడకగదుల ఇల్లు

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

పిచాయ్ తన భార్య అంజలి ఇంకా నలుగురు పిల్లలతో లాస్ ఆల్టోస్ (కాలిఫోర్నియా)లోని ఇంట్లో నివాసముంటున్నారు. ఈ 5 పడకగదుల ఇల్లు ఆధునిక హంగులతో ఆకట్టుకుటుంది. టెన్నీస్ కోర్ట్ అలానే ఫుట్‌బాల్ కోర్డులు ఉన్నాయి.

మొదటి అసైన్‌‌మెంట్‌తోనే

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా 2004లో నియమితులయ్యారు. పిచాయ్ తన మొదటి అసైన్‌‌మెంట్‌తోనే గూగుల్ దృష్టిని ఆకర్షించారు.

ప్రొఫెషనల్ క్రికెటర్‌గా

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

సుందర్ పిచాయ్ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా రాణించాలనుకున్నారు. అయితే, గూగుల్ సీఈఓగా స్థిరపడాల్సి వచ్చింది.

అంచలంచెలుగా

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

క్రోమ్ విభాగపు బాధ్యతలతో గూగుల్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుందర్ పిచాయ్ 2014 నాటికి గూగుల్ అన్ని ఉత్పత్తులకు బాధ్యత వహించే స్థాయికి ఎదిగారు.

ఆండ్రాయిడ్ డిపార్ట్‌మెంట్‌కు కొత్త రూపు

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

గూగుల్‌లోని ఆండ్రాయిడ్ డిపార్ట్‌మెంట్‌కు కొత్త రూపును తీసుకురావటంలో సుందర్ పిచాయ్ క్రియాశీలక పాత్ర పోషించారు.

సాదాసీదా జీవితం

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

సుందర్ పిచాయ్ సాదాసీదాగా జీవించేందుకు ఇష్టపడతారు.

చెన్నై వరదల్లో చిక్కుకుని...

గూగుల్ సీఈఓ గురించి ఆసక్తికర విషయాలు

ఇటీవల సంభవించిన చెన్నై వరదల్లో సుందర్ పిచాయ్ అమ్మమ్మ నాలుగు రోజుల పాటు ఓ ఇంట్లో తిండి, నీరు లేకుండా గడపాల్సి వచ్చిందట. ఈ వివరాలను సుందర్ ఓ ఇంటర్వ్వూలో వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Secret Facts About the life of Google CEO Sundar Pichai!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting