ఈ టిప్స్ తెలుసుకుంటే ఫేస్‌బుక్‌లో మీరే నెంబర్ వన్...?

Posted By: Super

ఈ టిప్స్ తెలుసుకుంటే ఫేస్‌బుక్‌లో మీరే నెంబర్ వన్...?

ఫేస్‌బుక్ ఎకౌంట్ కలిగి ఉన్నారా.. ఐతే మీరు మీ ఎకౌంట్‌కి మంచి పాపులారిటీని, మీకున్న ప్రెండ్స సర్కిల్స్‌ని పెంచుకోవాలని చూస్తున్నారా..ఐతే మీరు తప్పని సరిగా ఈ క్రింది సూచనలను పాటించాల్సిందే...

ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది స్నేహితులను పరిచయం చేసుకోవాలంటే మొట్టమొదగా మీరు చేయాల్సింది. మీ యొక్క ఫేస్‌బుక్ వాల్ మీద అర్దవంతమైనటువంటి పోస్ట్‌లను ఫోస్ట్ చేయడం మంచిది. మీరు అప్ లోడ్ చేసినటువంటి ఫోటోస్ అందరూ చూడకుంటా సెక్యూరిటీ సెట్టింగ్స్ పెట్టడం మంచిది. మీరు గనుక ఉద్యోగస్తులు అయినట్లైతే దానికి సంబంధించినటువంటి సమాచారం.. ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ వివరాలు సైతం ఫేస్‌బుక్ లో అప్ లోడ్ చేయడం మంచిది.

ఇక ఫేస్‌బుక్‌లో ఎటువంటి వాటిని బాగా తగ్గిస్తే మీకు వెయిటేజి పెరుగుతుందో అనేది దాని గురించి చర్చిద్దాం.. చాలా మంది ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో ప్రెండ్స్ పంపించినటువంటి లింక్స్ అదేవిధంగా మరోకరికి పంపిస్తుంటారు. ఇది మాత్రం మంచి పద్దతి కాదు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా తరచూ ఫేస్‌బుక్‌లో అప్ డేట్ చేయ్యడం కూడా అంత మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మరోకటి ఉంది. ఫేస్‌బుక్‌లో కొంత మంది పనికి రానటువంటి, అర్దం లేనటువంటి వీడియోస్ అప్ లోడ్ చేస్తుంటారు. మీరు మాత్రం అలా చేయకండి. కొన్ని సందర్బాలలో మీరు అప్ లోడ్ చేసినటువంటి ఫన్నీ వీడియోస్ ద్వారా మీ స్నేహితులు అభినందనలు మాత్రం దక్కుతాయి.

మరి ఎలాంటి పద్దతులు పాటిస్తే మనతో స్నేహితులు కోనసాగుతారంటే ముఖ్యంగా ఫేస్‌బుక్ ద్వారా విషయాలు చాలా త్వరగా అందరికి చేరతాయి కాబట్టి మీరు పంపేటటువంటి కంటెంట్‌‌ మంచిగా ఉండేటట్టు చూసుకుంటే మంచిది. మీ స్నేహితులు పోస్ట్ చేసినటువంటి ఫోస్ట్‌ల మీద సరదాగా కామెంట్స్ రాస్తే మంచిది. ఇంకోక ముఖ్య విషయం ఏమిటంటే మీ ఫ్రోపైల్ పిక్చర్‌ని నెలకోకసారి మారుస్తూ ఉండడం మంచిది. మార్చ మన్నాం కదా అని బీరు కొడుతున్న లేక మందు తాగుతున్న ఫోటోలు లాంటివి మాత్రం పెట్టకండి.

చివరగా ఫేస్‌బుక్‌లో ఎలాంటివి చేయకుండా ఉండే బాగుంటుంది. మీ స్నేహితులు రాసినటువంటి ఫోస్ట్‌ల మీద వారిని ఏడిపించే విధంగా ఉండేటటువంటి కామెంట్స్ మాత్రం రాయకండి. మీరు పోస్ట్ చేసినటువంటి అప్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా చూసుకోండి. అర్దవంతమైన ఫోస్ట్‌లను మాత్రమే రాస్తే మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot