సికింద్రబాద్ రైళ్లలో హై-టెక్ దొంగతనాలు జాగ్రత్త సుమా....
రైళ్లలో ప్రయాణించేటప్పుడు డబ్బు, విలువైన వస్తువులు మరియు బంగారు నగలు వంటివి కోల్పోవడం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము.ఇటువంటి దొంగతనాలు ప్రయాణికులకు మరచిపోలేని ఒక పీడకలగా ఉంటోంది. ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కావున దొంగలు కూడా దొంగతనాలు చేయడానికి అధునాతన టెక్నాలిజీని ఉపయోగిస్తున్నారు అని కొంత మంది అధికారులు తెలిపారు.

సికింద్రబాద్ ప్రాంతంలో గల అన్ని రైల్వే స్టేషన్ లలో జరిగిన దొంగతనాలను దర్యాప్తు చేసిన అధికారులు వాటి వివరాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇందులో చాలా దొంగతనాలు అధునాతనమైన టెక్నాలజీను ఉపయోగించి నడిచాయని పేర్కొన్నారు. దొంగతనాలు చేసే ముఠాలు మొదట వారు ఎంచుకున్న వ్యక్తి యొక్క ఫోటోలను వాట్సాప్ మరియు మెసెంజర్ వంటి మొబైల్ యాప్ లను ఉపయోగించి ముఠాలో ఉన్న వారందరు పంచుకుంటారు. తరువాత ఆ వ్యక్తి యొక్క వివరాలు మరియు అంతని వద్ద గల విలువైన వస్తువుల గురించి అందరికి తెలియజేస్తారు.తరువాత ఫోన్లలో కనిపించే గూగుల్ మ్యాప్ యాప్ లను ఉపయోగించి ఎస్కేప్ మార్గాలు ప్లాన్ చేయబడతాయి. ఫూల్‌ప్రూఫ్ ప్రణాళికను అమలు చేయడానికి నేరస్థులు అధిక సంఖ్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు.

సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ (ఎస్.సి.ఆర్) జోన్ అంతటా సుమారు 6,000 cctv నిఘా కెమెరాల నెట్వర్క్ ఉన్నప్పటికీ చిన్న చిన్న దొంగలు మరియు కొన్ని ముఠాలు ప్రయాణికులను మోసగించగలిగాయి. ఈ ఏడాది సికింద్రాబాద్ డివిజన్‌లో గల అన్ని స్టేషన్లు మరియు రైళ్లలో మొత్తంగా కలిపి సుమారు 462 దొంగతనాలు జరిగాయి.

462 దొంగతనాలలో అధికంగా నేరస్థులు 194 హై-ఎండ్ మొబైల్ ఫోన్‌లు నమోదు చేయబడ్డాయి. ఏదేమైనా నేరస్థుల అతిపెద్ద లక్ష్యం బంగారు ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగులు మరియు సూట్‌కేసులు వంటివి ఎక్కువగా రాత్రిపూట ప్రయాణికులు బాగా నిద్రపోతున్న సమయాలలో దొంగిలించబడ్డాయి.

ఇటువంటి సందర్భాల్లో దొంగ సాధారణంగా నిజమైన ప్రయాణీకుడిలాగా నటిస్తు 2 వ లేదా 3 వ AC కోచ్లలో రిజర్వేషన్ చేసుకుంటాడు. మొదటి కొన్ని గంటలలో అతను ఎక్కువ బంగారు నగలు ధరించిన మహిళలు లేదా మంచి కాస్ట్ లీ ఫోన్లను కలిగి ఉన్న ఎవరైనా ప్రయాణీకుడిని గుర్తిస్తాడు. రాత్రిపూట బాగా ఆలస్యం అయిన తరువాత అతను ప్రయాణీకుల యొక్క హ్యాండ్‌బ్యాగులు మరియు సూట్‌కేసులు వంటివి మరియు వాటితో పాటు ప్రయాణికులు ధరించిన ఆభరణాలు,పర్సులు మరియు మొబైల్ ఫోన్‌లు వంటివి దొంగలించిన తరువాత వెంటనే స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న వారి సహచరుడికి అప్పగిస్తారు.

ఇందులో ముఖ్యముగా తెలుసుకోవలసింది వారు ఇరువురు మొబైల్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒకరిని ఒకరు కలిసి దొంగిలించబడిన వస్తువులను మార్పిడి చేసుకుంటారు. ఆ విధంగా ఒక వేల అనుమానంతో దొంగ పట్టుకున్న కూడా అతని వద్ద ఏమీ దొరకదు. వారు రైలు దిగిన తర్వాత మొబైల్ ఫోన్లలో కనిపించే గూగుల్ మ్యాప్ సహాయంతో తప్పించుకునే మార్గం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు అని రామకృష్ణ అన్నారు.

రైలు ప్రయాణంలో ఎక్కువ శాతం దొంగతనాలు సూట్‌కేస్ వంటి వస్తువులను దొంగలించిన సందర్భాలు చాలా ఉన్నాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద గల సిసిటివి ఫుటేజ్ ఉపయోగించి నేరస్థుడు ఒక బ్యాగ్ ను దొంగలిస్తున్న కేసును ఇటీవల రైల్వే పోలీసులు గుర్తించారు. దొంగతనం కేసులను పునఃపరిసీలించడానికి మరియు గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్ ముఖ్యంగా సహాయపడుతుంది. వీటిని ఉపయోగించి అనేక సందర్భాలలో చాలా కేసులు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications