స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఫోన్ భద్రతా వ్యవస్థను దాటి డేటాను దొంగిలించగలిగే మాల్వేర్..!!
స్మార్ట్‌ఫోన్ లకు మాల్వేర్ ముప్పు వెంటాడుతునే ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏదో రకంగా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. అయితే గతం కంటే ఈ మాల్వేర్ ముప్పు ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే గతం కంటే ఈ మాల్వేర్ లు అత్యంత శక్తివంతమైనవిగా ఉంటున్నాయి. ఫోన్ భద్రతా వ్యవస్థను దాటుకొని మరీ .. సున్నితమైన సమాచారాన్ని దొంగలించగలిగేంత సామర్థ్యం ఉన్న మాల్వేర్‌లు (Malware Attacks on Smartphones) పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రమాదకరమైన మాల్వేర్ గురించి భద్రత సంస్థ హెచ్చరించింది.
తాజాగా కొత్త మాల్వేర్ గురించి ప్రముఖ భద్రతా సంస్థ ప్రోమోన్ (Promon) గురించి కీలక హెచ్చరికలను జారీ చేసింది. ఫోన్ భద్రతా వ్యవస్థను దాటి సున్నితమైన డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది. స్నోబ్లైండ్ పేరుతో ఉన్న మాల్వేర్ (Snowblind malware) పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న యాప్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపింది.

దీంతోపాటు ఈ మాల్వేర్ ఎలా పనిచేస్తుందనే వివరాలను భద్రతా సంస్థ ప్రోమోన్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వ్యవస్థ తనిఖీ చేసే ముందే ఫోన్‌లోని యాప్‌లను ఈ స్నోబ్లైంట్ మాల్వేర్ ప్రభావితం చేయగలదని తెలిపింది. అనంతరం డేటాను దొంగిలిస్తుందని తెలిపింది. తనకు అనుకూలంగా యాప్‌లను నియంత్రిస్తుందని పేర్కొంది.
ఈ తరహా మాల్వేర్ ఫోన్‌లోకి చొరబడినా.. గుర్తించేందుకు వీలుండదని తెలిపింది. దీంతోపాటు గుర్తించేంత స్థాయిలో ఎటువంటి సూచనలు ఉండవని తెలిపింది. అయితే సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఇలాంటి మాల్వేర్‌ల పట్ల వినియోగదారులు అప్రమత్రంగా ఉండాలి. తెలియని వెబ్‌సైట్, యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. మరియు లింక్‌లను క్లిక్ చేయకూడదు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది.
** దీంతోపాటు కొన్ని పద్ధతుల ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది గుర్తించేందుకు వీలుంది. ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా డిశ్ఛార్జి అయిపోతుంటే హ్యాకింగ్ గురైనట్లు కొంత వరకు అంచనాకు రావచ్చు. ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈ సమస్యను మీరు గుర్తిస్తే హ్యాంకింగ్‌కు గురైనట్లు నిర్ధారించుకోవచ్చు.
ఎటువంటి కారణం లేకుండా ఫోన్ వేడెక్కుతుంటే ఫోన్ హ్యాక్ చేయబడిందని ప్రాథమికంగా భావించవచ్చు. ఫోన్‌ను ఎక్కువ సేపు వినియోగించినప్పుడు వేడెక్కడం సాధారణం. అయితే అసలు వినియోగించని సమయంలో కూడా ఫోన్ వేడెక్కుతుందంటే మీ ఫోన్‌ను ఇతరులు నియంత్రిస్తున్నట్లు అంచనాకు రావచ్చు.
బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి యాప్‌లు లేనప్పుడు మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తుంటే హ్యాకింగ్ బారినపడినట్లు భావించవచ్చు. వేరొకరు మీ ఫోన్‌ను నియంత్రిస్తుంటేనే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు యాప్‌లు క్రాష్ అవ్వడం, వినియోగిస్తుండగా మధ్యలో ఆగిపోవడం హ్యాకింగ్ సంకేతాలుగా భావించవచ్చు. దీంతోపాటు సబ్‌స్క్రై్బ్ చేయని వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుంచి పాప్ అప్ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్సి ఉంటుంది.
దీంతోపాటు మీ ఫోన్‌లో ఏయే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ఉత్తమం. కొన్ని యాప్‌లు అనుమతి లేకుండా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ కావచ్చు. అటువంటి యాప్‌ల ద్వారా హ్యాకర్లు మన ఫోన్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది. మరియు ఫోన్ గ్యాలరీలో మీకు తీసిన ఫోటోలు కాకుండా ఇతర ఫోటోలను గుర్తి్స్తే మీ ఫోన్‌ను ఇతరులు వినియోగిస్తున్నట్లు అంచనాకు రావచ్చు.


Click it and Unblock the Notifications








