5జీపై తీరని అనుమానాలు ఇవే
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపుతున్న 4జీ మంటలు ఇంకా చల్లారకుండానే 5జీ శరవేగంగా దూససుకొస్తోంది.
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు రేపుతున్న 4జీ మంటలు ఇంకా చల్లారకుండానే 5జీ శరవేగంగా దూససుకొస్తోంది. 5జీని మేమే ముందు తీసుకురావాలనే కాన్సెప్ట్ లో దిగ్గజాలన్నీ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే టాప్ కంపెనీలు 5జీ వైపు అడుగులు వేసాయి కూడా. తొలి 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు దిగ్గజ మొబైల్ హ్యండ్‌సెట్స్ తయారీ కంపెనీలన్నీ పోటీపడుతున్నాయి. దీని ద్వారా ఏ సినిమానైనా సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్‌లెస్ కార్లు అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్ సిటీల ఏర్పాటు సులభతరం అవుతుంది. ఈ శుభవార్తలతో పాటు మరొక షాకింగ్ న్యూస్ యూజర్లను వేధిస్తోంది.

5జీ నెట్‌వర్క్‌లో భద్రతా లోపాలు
5జీ నెట్‌వర్క్ అంత సురక్షితం కాదనేది టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. రానున్న 5జీ నెట్‌వర్క్‌లో భద్రతా లోపాలున్నాయని తెలిపారు. హ్యాకర్లు వీటి సాయంతో యూజర్ల సమాచారాన్ని సులభంగా తస్కరించే అవకాశముందని పేర్కొంటున్నారు. కాల్స్, మెసేజ్‌లు వంటి సమాచారం దొంగలించవచ్చని తెలిపారు.

ఒక పరిశోధన పత్రాన్ని
5జీ భద్రతా లోపాలకు సంబంధించి టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, ఈటీహెచ్ జూరిచ్, సిన్‌టెఫ్ డిజిటల్ నార్వేకు చెందిన రీసెర్చర్లు ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు.

(ఏకేఏ)పై ప్రతికూల ప్రభావం
అథంటికేషన్ ఆఫ్ కీ అగ్రిమెంట్ (ఏకేఏ)పై ప్రతికూల ప్రభావం చూపగలిగే భద్రతా లోపం 5జీ నెట్‌వర్క్‌లో ఉంది. ఏకేఏ అనేది ఒక నెట్‌వర్క్ సెక్యూరిటీ ప్రొటొకాల్. ఫోన్, సెల్యులర్ నెట్‌వర్క్స్ మధ్య కమ్యూనికేషన్లకు రక్షణ కల్పిస్తుంది. 5జీ నెట్‌వర్క్‌లోని భద్రతా లోపం దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రస్తుత భద్రత ముప్పు
ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్ఐ) క్యాచర్ల ముప్పు నుంచి 5జీలో రక్షణ ఉంటుందని చాలా మంది టెక్ నిపుణులు భావించారు. అయితే ప్రస్తుత భద్రత ముప్పు వీళ్లను షాక్‌కు గురిచేసిందని తెలుస్తోంది.

ఐఎంఎస్ఐ క్యాచర్లు
ఐఎంఎస్ఐ క్యాచర్స్ అనేవి ఒకరమైన డివైస్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఫేక్ సెల్ టవర్ల మాదిరిగా పనిచేస్తాయి. నిజమైన టవర్లకు, మొబైల్ ఫోన్లకు మధ్య ఇవి నకిలీ టవర్ల మాదిరిగా వ్యవహరిస్తాయి. దీంతో ఐఎంఎస్ఐ క్యాచర్లు మన కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ ట్రాఫిక్ వంటి సమాచారాన్ని పొందుతారు. 5జీ వస్తే ఇది ముప్పులో పడుతందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








