ట్రూకాలర్‌తో జాగ్రత్త, డేటా అటాకర్ల చేతుల్లోకి వెళుతోంది

By Gizbot Bureau
|

అన్ నౌన్ నంబర్లు, అలాగే పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో సదరు కాల్స్ చేసే, ఎస్‌ఎంఎస్‌లను పంపే ఫోన్ నంబర్లను యూజర్లు బ్లాక్ చేయవచ్చు. దీంతో అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బాధ తప్పుతుంది.

ట్రూకాలర్‌తో జాగ్రత్త, డేటా అటాకర్ల చేతుల్లోకి వెళుతోంది

 

అయితే ట్రూ కాలర్ యాప్ వల్ల మనకు అంతా లాభమే కలుగుతుంది కానీ.. తాజాగా ఆ యాప్‌లో వచ్చిన అప్‌డేట్‌తో మన బ్యాంక్ అకౌంట్‌లకు ముప్పు ఏర్పడింది. ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది.

పనిచేయని ఫోన్ నంబర్ల విషయంలోtre

పనిచేయని ఫోన్ నంబర్ల విషయంలోtre

ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రద్దైన, పనిచేయని ఫోన్ నంబర్ల విషయంలో కూడా ట్రూకాలర్ ద్వారా వినియోగదారుల వివరాలను తెలుసుకోవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అటాకర్ నంబర్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా ట్రూ కాలర్ యూజర్ అక్కౌంట్‌లోనికి లాగిన్ అయితే... అతని వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని సైబర్ సెక్యూరిటీ సైంటిస్ట్ అహ్మద్ వెల్లడించారు.

 సైబర్‌ అటాకర్లు లాగిన్‌ కావడానికి

సైబర్‌ అటాకర్లు లాగిన్‌ కావడానికి

ట్రూకాలర్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌లోకి సైబర్‌ అటాకర్లు లాగిన్‌ కావడానికి ఈ లోపం ఉపకరిస్తుందని, ఒకసారి ఎవరైనా అటాకర్‌ నెంబర్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ ద్వారా ట్రూకాలర్‌ ఖాతాదారుడి అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే.. అతని వివరాలు, డాటా అటాకర్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని అహ్మద్‌ తెలిపారు. దీనిని ఒక వీడియో ద్వారా ఆయన సవివరంగా వివరించారు.

ట్రూకాలర్‌ ఖాతాల దుర్వినియోగంపై
 

ట్రూకాలర్‌ ఖాతాల దుర్వినియోగంపై

ఇందులో ట్రూకాలర్‌ చాట్‌ నుంచి పనిచెయ్యని మొబైల్‌ నెంబర్‌కు మెసెజ్‌ పంపించారు . అది ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌దని తేలింది. ఈ మేరకు ట్రూకాలర్‌ ఖాతాల దుర్వినియోగంపై ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ సంస్థలు స్పందిస్తూ అహ్మద్‌ ప్రయత్నం చాలా గొప్పదని, ఆయన కనిపెట్టిన లోపాలను గ్రహించామని తెలిపారు. అతనితో కలిసి పనిచేస్తామని సంస్థలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని పేర్కొన్నాయి.

 ఆటోమేటిక్‌గా యాడ్

ఆటోమేటిక్‌గా యాడ్

ఇదిలా ఉంటే ఈ యాప్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అయిన యూజర్ల బ్యాంక్ యూపీఐ ఖాతాలు ట్రూ కాలర్ పే ఫీచర్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతున్నాయి. యూజర్లు యాప్‌లో యూపీఐ ఐడీని యాడ్ చేసుకోవడం కోసం ఎలాంటి రిక్వెస్ట్ పంపకున్నా ఆటోమేటిక్‌గా ఈ ఐడీలు ట్రూ కాలర్ యాప్‌లో యాడ్ అవుతున్నాయి. అలాగే యూపీఐ ఐడీలు యాడ్ చేసినట్లు కన్‌ఫాం కూడా అవుతున్నాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ట్రూ కాలర్ యూజర్లు ఈ విష‌యంపై ఫిర్యాదు చేస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Security Researcher Discovers Major Flaw In Truecaller's Login Process

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X