డేంజర్ జోన్‌లో 34 కంపెనీల ఫోన్లు, మీ ఫోన్ ఓ సారి చెక్ చేసుకోండి

By Gizbot Bureau
|

క్వాల్‌కామ్ కంపెనీ యూజర్లకు అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. వెంటనే వారి ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో CVE-2019-10540 అనే బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వచ్చిందని క్వాల్‌కామ్ తెలిపింది.ఈ బగ్‌కు ఫిక్స్‌ను డెవలప్ చేశామని, దాన్ని ఓఈఎం అప్‌డేట్ రూపంలో ఇప్పటికే అందుబాటులో ఉంచామని చెప్పింది.కనుక క్వాల్‌కామ్ ప్రాసెసర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ ఓఎస్‌ను నూతన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని క్వాల్‌కామ్ సూచించింది.

Security warning for these 34 smartphone users

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అనేక కంపెనీలకు చెందిన పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్‌కామ్ కంపెనీ తయారు చేసే ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో అనేక రకాల ప్రాసెసర్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 855, 845, 730, 710, 675.. ఇలా అనేక రకాల ప్రాసెసర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు అన్నింటికీ కంపెనీ అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. క్వాల్‌కామ్ ప్రాసెసర్లు కలిగిన ఈ కింది 34 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల యూజర్లు కచ్చితంగా ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని క్వాల్‌కామ్ తెలిపింది.

OnePlus, ఒప్పో, అసుస్ కంపెనీ ఫోన్లు

OnePlus, ఒప్పో, అసుస్ కంపెనీ ఫోన్లు

వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రొ, వన్‌ప్లస్ 6టి, వన్‌ప్లస్ 6

ఒప్పో ఫోన్లు

ఒప్పో రెనో, రియల్‌మి ఎక్స్, ఆర్17 ప్రొ

అసుస్ ఫోన్లు

అసుస్ 6జడ్, అసుస్ జెన్‌ఫోన్ 5జడ్, మ్యాక్స్ ప్రొ ఎం2, మ్యాక్స్ ప్రొ ఎం1

 

షియోమీ, గూగుల్ ఫోన్లు

షియోమీ, గూగుల్ ఫోన్లు

షియోమీ బ్లాక్ షార్క్ 2, రెడ్‌మీ కె20 ప్రొ, పోకో ఎఫ్1, రెడ్‌మీ కె20, రెడ్‌మీ నోట్ 5ప్రొ, ఎంఐ ఎ2, నోట్ 7 ప్రొ, రెడ్‌మీ 6 ప్రొ

గూగుల్ ఫోన్లు

గూగుల్ పిక్సల్ 3, గూగుల్ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, గూగుల్ పిక్సల్ 3ఎ ఎక్స్‌ఎల్, గూగుల్ పిక్సల్ 3ఎ

 

నోకియా వివో, ఎల్‌జీ, శాంసంగ్ ఫోన్లు
 

నోకియా వివో, ఎల్‌జీ, శాంసంగ్ ఫోన్లు

నోకియా 8 సిరోకో, నోకియా 6.1 ప్లస్, నోకియా 8.1

వివో, ఎల్‌జీ, శాంసంగ్ ఫోన్లు

వివో జడ్1 ప్రొ, నెక్స్, వి15 ప్రొ, ఎల్‌జీ వీ30 ప్లస్, జీ7 థిన్‌క్యూ , శాంసంగ్ ఎ70, ఎం40, నూబియా రెడ్ మ్యాజిక్ 3

 

Best Mobiles in India

English summary
Security warning for users of these 34 Android smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X