దెయ్యం కనిపించింది..?

Posted By:

దెయ్యాలను మూఢనమ్మకాలుగా భావించే వారు తప్పక ఈ వీడియోను చూడాల్సిందే. అదృశ్య శక్తి తారస పడే దృశ్యంతో కూడిన ఓ భయానక సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఓ పురాతన పబ్‌లో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు విపరీత మానసిక ప్రవర్తనలను తలపించేవిగా అనిపిస్తున్నాయి.

 దెయ్యం కనిపించింది..?

వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌లోని అతి పురాతన పబ్‌లలో ఒకటైన 'Ye Olde Man and Scythe'లో ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి నీడతో కూడిన ఓ రూపం బార్ చుట్టూ తిరుగుతున్న దృశ్యంతో సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ చేయబడింది. ఆ తరువాత నుంచి కెమెరా పనిచేయటం ఆపేసింది. ఈ ఘటన పై పబ్ మనేజర్ టోనీ డూలీ స్పందిస్తూ ఫిబ్రవరి 14 రాత్రి పబ్ ప్రాంగణంలో ఓ అద్దం కూడా పగిలి ఉన్నట్లు స్థానిక పత్రికతో వెల్లడించారు. అయితే, ఈ ఘటనను పలువురు పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. పబ్‌లో రికార్డ్ అయిన ఆ అనుమానస్పద వీడియోను క్రింది చూడొచ్చు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/rZ5XyEdEqIk?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot