అసంతృప్తి.. పరిష్కారం కోసం వెతుకులాట?

Posted By: Prashanth

అసంతృప్తి.. పరిష్కారం కోసం వెతుకులాట?

 

సొగసరి స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ ‘వన్ ఎక్స్’ పేరుతో ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను గడిచిన ఏప్రిల్‌లో విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌3 నుంచి గట్టి పోటీని ఎుదుర్కొన్న ఈ డివైజ్ ఇప్పుడు మరో సాంకేతిక సమస్యతో నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘వన్ ఎక్స్’ను కొనుగోలు చేసిన వారిలో పలువురు తమ డివైజ్‌లోని వై-ఫై ఫీచర్ నిరాశాజనమైన పనితీరును ప్రదర్శిస్తుందంటూ ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. సమస్య తలెత్తిన ఫోన్‌లలో వై-పై సిగ్నల్ క్రమంగా తగ్గిపోతుంది, పర్యావసానంగా బ్యాటరీ త్వరగా డౌన్ అవుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల పట్ల హెచ్‌టీసీ వర్గాలు అధికారకంగా స్పందించనప్పటికి సమస్య పరిష్కారం పై దృష్టిసారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి రెండు వారల్లో ఈ సమస్యకు పరిష్కారం మార్గం లభించే అవకాశముంది.

హెచ్‌టీసీ వన్ x ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఆడ్వాన్సుడ్ క్వాడ్ కోర్ టెగ్రా 3 ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.5 GHz,

* ఉన్నతమైన రిసల్యూషన్‌తో కూడిన 4.7అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

* 8 మెగా పిక్సల్ కెమెరా (హై డిఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),

* 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

* వై-ఫై, బ్లూటూత్ (వర్షన్ 4), ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,

* ఇంటర్నల్ మెమరీ 321జీబి,

* ర్యామ్ సామర్ధ్యం 1జీబి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot