నోకియా6 తాజా అప్‌డేట్‌ !

By: Madhavi Lagishetty

HMD గ్లోబల్ నోకియా నుంచి కొత్త రిలీజ్ అయిన మిడ్ రేంజ్స్మార్ట్‌ఫోన్ నోకియా7 అప్‌డేట్‌ అయ్యింది. సెక్యూరిటీ ప్యాచ్తోపాటు ఇతర ఇంప్రూవ్ మెంట్స్ ను మొదటిసారిగా అప్‌డేట్‌ చేసింది. నోకియా7 తర్వాత నోకియా 6 సెక్యూరిటీ ప్యాచ్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోకియా6 తాజా అప్‌డేట్‌ !

నోకియా6 మోడల్ సంఖ్యలు TA-1000,TA-1003 వరుసగా చైనా మరియు హాంగ్ కాంగ్ లోస్మార్ట్‌ఫోన్ వేరియంట్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ద్వారా అప్‌డేట్‌ అయ్యింది. NOKIA POWER USER క్లూ ప్రకారం, ఆండ్రాయిడ్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మార్కెట్లో లక్షలాది ఆండ్రాయిడ్స్మార్ట్‌ఫోన్లకు ముప్పుగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రాక్ వై-ఫై కోసం అవసరమైన ప్యాచ్లను అందిస్తుంది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్ రకాలు ఆండ్రాయిడ్ 7 .1.2నౌగట్ అప్‌డేట్‌ను ఈమధ్యే అందుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో నోకియాకు నవంబర్ సెక్యూరిటీ అప్‌డేట్‌ను పెంచుటకు హెచ్ఎండి రెడీగా ఉంది. గ్లోబల్ వేరియంట్ త్వరలోనే అప్‌డేట్‌ను చేయనున్నట్లు తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ టైం లైన్ అంటే ఏమిటి?

మార్కెట్లో అందుబాటులో ఉన్న నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు నెలవారీగా సెక్యూరిటీ అప్‌డేట్స్ మరియు ఓఎస్ అప్‌డేట్స్ రిలీజ్ చేయడానికి హెచ్ఎండి గ్లోబల్ రెడీగా ఉంది. సంస్థ రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్ ఫోన్లు ఓఎస్ అప్ డేట్ సపోర్టును రెండు సంవత్సరాల్లో అందుకుంటాయని అధికారికంగా కంపెనీ తెలిపింది.

నోకియా6 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే.. 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 1080పిక్సెల్స్ డిస్ప్లేని రిలీజ్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 430 ఎస్ఓసీని 3జిబి ర్యామ్ మరియు 32జిబి స్టోరేజితో కలుపుతుంది. మైక్రో ఎస్డి కార్డుతో 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

స్టాక్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడుతుంది. ఈ ఏడాది చివరినాటికి ఆండో ఓరియోకు అప్‌డేట్ అవుతుంది. అంతేకాదు ఇది వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ P అప్‌డేట్ను అందుకుంటుంది. ఇమేజింగ్ అంశాలను చూసినట్లయితే 16మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు 8మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఫుల్ హెచ్ డి వీడియో రికార్డింగ్ సపోర్టుతో వచ్చాయి. డివైస్ 4G వోల్ట్, వైఫై , బ్లూటూత్ తోపాటు ఇతర కామన్ ఫీచర్స్ కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Read more about:
English summary
Nokia 6 variants in China and Hong Kong have received the November Security update. This update is expected to be rolled out to the global variants.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot