జర్మనీ ప్రకటించేసింది!

By Prashanth
|
Asus


ఎంపిక చేసిన ట్రాన్స్ ఫార్మర్ టాబ్లెట్ లలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను అప్ డేట్ చేయాలని అసస్ జర్మనీ నిర్ణయం తీసుకోవటంతో అక్కడి టెక్నాలజీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా అప్ డేట్ ను స్వీకరించే గ్యాడ్జెట్ ల జాబితాలో అసస్ ట్రాన్స్ ఫార్మర్ టీఎఫ్101తో పాటు అసస్ ఈ ప్యాడ్ స్లైడర్ ఎస్ఎల్101 టాబ్లెట్ పీసీలు ఉన్నాయి.

ట్రాన్స్ ఫార్మర్ సిరీస్ టాబ్లెట్ పీసీలన్నింటిలో అసస్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వోఎస్ ను ప్రవేశపెట్టనుందన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ఈ పుకార్లను ఖండిస్తూ అసస్ వెలువరించిన తాజా ప్రకటన పలువురిలో మెదులుతున్న సందేహాలను నివృత్తి చేసినట్లయింది. ఈ టాబ్లెట్ లలో ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చెయ్యటం వల్ల మరింత సౌక్యవంతమైన కంప్యూటింగ్ ను యూజర్ ఆస్వాదించగలుగుతాడు.

మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ‘అసస్ మెమో 171’ ఫీచర్లు:

డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 7 అంగుళాల సూపర్ ఐపీఎస్, LED డిస్ ప్లే (రిసల్యూషన్ 1280*800 పిక్సల్స్), 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్, సెకండరీ కెమెరా 1.3 మెగా పిక్సల్స్,ఇంటర్నల్ మెమెరీ 16జీబి,ర్యామ్ 1జీబి, మిమిక్ బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, ధర అంచనా రూ.30,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X