సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేయండి: కార్పోరేట్ జాబు కొట్టండి

Written By:

ఏందీ...టైటిల్ విచిత్రంగా ఉందని చూస్తున్నారా..అవును మీరు విన్నది నిజమే..ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు మీ రెజ్యూమ్‌తో పాటు సెల్ఫీ వీడియోలను కూడా చూస్తున్నాయి. సెల్ఫీ వీడియోలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మీ ప్రవర్తన,ఇంకా అనేక రకాల అంశాలను ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నాయి. అందుకే రెజ్యూమ్‌తో పాటు మీకు సంబంధించిన సెల్ఫీ వీడియోని కూడా అప్‌లోడ్ చేయాలని కార్పోరేట్ కంపెనీలు ఇప్పుడు సూచిస్తున్నాయి.

Read more: ఐ ఫోన్‌తో పెళ్లి మొత్తం షూట్ చేశాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుల వరకు సెల్ఫీ

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుల వరకు సెల్ఫీ తీసుకోవడం ఒక సరదా అయిపోయింది. ఇక సెల్ఫీలను సామాజిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫ్రెండ్స్‌తో షేరు చేసుకుని వచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి మురిసిపోయే వారి గురించి చెప్పనే అవసరం లేదు.

ఉద్యోగుల నియామకాలు, మార్కెటింగ్‌ కార్యకలాపాల్లో ఈ సెల్ఫీలు

అయితే దీని వల్ల ప్రయోజనం మాత్రం కొంతే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సెల్ఫీ వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉద్యోగుల నియామకాలు, మార్కెటింగ్‌ కార్యకలాపాల్లో ఈ సెల్ఫీలు కీలక పాత్ర పోషిస్తోన్నాయంటే నమ్మండి.

కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియలో భాగంగా

కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియలో భాగంగా సెల్ఫీ ఫొటోలు, వీడియోలను పరిశీలించేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నియామకాల ప్రక్రియలో పాలు పంచుకునే పలు వెబ్‌సైట్లు తమ వద్ద రిజిస్టర్‌ చేసుకునే నిరుద్యోగులకు సంబంధించిన రెజ్యూమ్‌తోపాటు సెల్ఫీ వీడియోను కూడా అప్‌లోడ్‌ చేయమని కోరుతున్నాయి.

వెబ్‌సైట్లలో రిజిస్టర్‌ అయిన కార్పొరేట్‌ సంస్థలు

ఈ వీడియోల్లో తమ అర్హతలు, హాబీలు, ఇంతకు ముందు చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అనుభవాలను వెల్లడించమని చెబుతున్నాయి. వెబ్‌సైట్లలో రిజిస్టర్‌ అయిన కార్పొరేట్‌ సంస్థలు వీటిని పరిశీలించి సంబంధిత వ్యక్తికి సంబంధించిన భావ వ్యక్తీకరణ, లాంగ్వేజ్‌ స్కిల్‌, బాడీ లాంగ్వేజ్‌ను తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది.

ఉద్యోగుల నియామకాలకు అయ్యే వ్యయాన్ని

తద్వారా ఉద్యోగుల నియామకాలకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న చాలా కంపెనీలు సెల్ఫీ వీడియోల ద్వారా తక్కువ సమయంలో ఉద్యోగికి సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునే వెసులుబాటు లభిస్తోంది.

సెల్ఫీ వీడియోలు కార్పొరేట్‌ సంస్థలకు అందివచ్చిన మరొక సౌకర్యమని

సెల్ఫీ వీడియోలు కార్పొరేట్‌ సంస్థలకు అందివచ్చిన మరొక సౌకర్యమని రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇది అటు అభ్యర్థికి, ఇటు నియామక సంస్థలకు ప్రయోజనం కలిగిస్తుందని అంటున్నారు.

 

 

ఇక సెల్ఫీ మార్కెటింగ్‌ విషయానికొస్తే.. వివిధ

సందర్భాల్లో తీసుకున్న సెల్ఫీలను సామాజిక వెబ్‌సైట్ల ద్వారా పంచుకోవడమూ ఒక విధంగా తమను తాము మార్కెటింగ్‌ చేసుకున్నట్టే. ఈ వ్యూహాన్ని అనుసరించిన సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు.

కాగా కొన్ని కంపెనీలు తమ వద్ద ఉన్న ఉత్పత్తుల పనితీరును

కాగా కొన్ని కంపెనీలు తమ వద్ద ఉన్న ఉత్పత్తుల పనితీరును వివరిస్తూ సెల్ఫీలను సోషల్‌ వెబ్‌సైట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారి సెల్పీ అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు.

కొత్తగా ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి

ఇవి కొత్తగా ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతున్నాయి. కొంత మంది ప్రొఫెషనల్స్‌ తమ నైపుణ్యాలను వివరిస్తూ సెల్ఫీలను పోస్ట్‌ చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగ అవకాశాలను సంపాదించుకుంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Selfie goes mainstream in recruitment, marketing
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot