ఇదేం డిజైన్?ఆపిల్ మాక్ ప్రొ మీద పేలుతున్న జోకులు

|

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ప్రపంచ దిగ్గజం ఆపిల్ కాలిఫోర్నియాలో జరిగిన యానివల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ (WWDC) ఈవెంట్ లో సరికొత్త ప్రొడక్టులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 13 సహా సరికొత్త యాప్ అప్ డేట్స్ ను రిలీజ్ చేసింది.

ఇదేం డిజైన్?ఆపిల్ మాక్ ప్రొ మీద పేలుతున్న జోకులు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐఫోన్ మేకర్.. ఫాస్టెస్ట్ డెస్క్ టాప్ కంప్యూటర్ కొత్త Mac Pro. ను కూడా రివీల్ చేసింది. ఇప్పటివరకూ ఆపిల్ రిలీజ్ చేసిన మ్యాక్ కంప్యూటర్లకు పూర్తి భిన్నంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో దీన్ని డిజైన్ చేశారు. కాగా ఆపిల్ ప్రవేశపెట్టిన కొత్త కంప్యూటర్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ అవుతోంది. మ్యాక్ కంప్యూటర్ డిజైన్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆపిల్ సరికొత్త డిజైన్ పై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

జున్ను తురిమే యంత్రం

జున్ను తురిమే యంత్రం

ఇది కంప్యూటర్ లా లేదని చూడటానికి అచ్చం ‘జున్ను తురిమే యంత్రం (చీజ్ గ్రేటర్)లా ఉంది' అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి డిజైన్ చేయడం ఒక్క ఆపిల్ కంపెనీకి సాధ్యమంటూ సరదాగా సైటైర్లు వేస్తున్నారు.

అదిరే ఫీచర్లు

అదిరే ఫీచర్లు

ఆపిల్ డిజైన్ చేసిన సరికొత్త కంప్యూటర్ పనిచేసే విధానం అత్యధికంగా ఉండేలా, కాన్ఫిగర్ బిలిటీ, వర్క్ స్టేషన్ క్లాస్ ఇంటెల్ జియోన్ ప్రాసిసర్స్ 28 కోర్ లతో పాటు అన్ని న్యూ మ్యాక్ ప్రో ఫీచర్లు ఉండేలా డిజైన్ చేశారు. హై పెర్ఫార్మన్స్ మెమెరో సిస్టమ్ తో 1.5TB కెపాసిటీ, 8 PCI ఎక్స్ పాన్షన్ స్లాట్, గ్రాఫిక్ ఆర్టిటెక్చర్ ఫీచర్ ఎంతో ఎట్రాక్టీవ్ గా డిజైన్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డు మ్యాక్ ప్రో కంప్యూటర్ లో అమర్చారు.

 RAW వీడియోకు

RAW వీడియోకు

ప్రత్యేకించి ఆఫ్టర్ బర్నర్ (Afterburner) గేమ్ ఛేజింగ్ యాక్సలేటర్ కార్డును కూడా ఆపిల్ ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా ఒకే సమయంలో 8వేల ప్రొరేస్ RAW వీడియోకు సంబంధించిన మూడు స్ట్రీమ్ లను ప్లే బ్యాక్ ఎనేబుల్ చేయొచ్చు. ఆపిల్ కొత్త మ్యాక్ ప్రో కంప్యూటర్ అత్యంత శక్తివంతమైన యంత్రంగా చెప్పడంలో సందేహమే లేదు.

5వేల 999 డాలర్లు

5వేల 999 డాలర్లు

ఆపిల్ మ్యాక్ ప్రో కంప్యూటర్ ధర 5వేల 999 డాలర్లు (రూ.4 లక్షలు)గా ఉంది. ఇవి రూ.3,46,220, రూ.4,15,490 ప్రారంభ ధరలకు సెప్టెంబర్ నెలలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అందరి ఆలోచనలకు తగినట్టుగా ఆపిల్ ఈ కొత్త డిజైన్ తో ముందుకు వచ్చింది. మ్యాక్ ప్రో కంప్యూటర్ ను దగ్గర నుంచి పరిశీలిస్తే క్యాబినెట్ వెనుక భాగం గ్రిల్స్ డిజైన్ ఉంది. ఈ డిజైన్ అచ్చం చీజ్ గ్రేటర్ యంత్రం మాదిరిగా ఉందని ఆన్ లైన్ లో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

 మాక్‌ఓఎస్ క్యాటలినా

మాక్‌ఓఎస్ క్యాటలినా

ఇవే కాకుండా ఆపిల్ తన వార్షిక డెవలపర్ సదస్సులో నూతన మాక్‌ఓఎస్ క్యాటలినాను కూడా ప్రవేశపెట్టింది. ఇందులోనూ పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఓఎస్ కూడా సెప్టెంబర్‌లోనే లభిస్తుంది. 2012 మధ్యలో, ఆ తరువాత వచ్చిన అన్ని మాక్‌లలో ఈ నూతన ఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది.

 వాచ్ ఓఎస్ 6 ఫీచర్లు

వాచ్ ఓఎస్ 6 ఫీచర్లు

దీంతో పాటు వాచ్ ఓఎస్ 6 ని కూడా పరిచయం చేసింది. ఆపిల్ ప్రవేశపెట్టిన వాచ్ ఓఎస్ 6 లో కొత్తగా సైకిల్ ట్రాకింగ్ యాప్, నాయిస్ యాప్, న్యూ ట్రెండ్స్ ట్యాబ్‌ను అందివ్వనున్నారు. అలాగే హెల్త్ అండ్ ఫిట్‌నెస్ యాప్‌లో కొత్త ఫీచర్లు, నూతన వాచ్ ఫేసెస్, యాప్ స్టోర్‌కు సపోర్ట్, కొత్త కాలిక్యులేటర్ యాప్ తదితర ఫీచర్లను అందివ్వనున్నారు. ఇక వాచ్ ఓఎస్ 6 సెప్టెంబర్ నెలలో లభ్యం కానుండగా, యాపిల్ వాచ్ సిరీస్ 1 ఆపైన వచ్చిన వాచ్‌లలో ఈ ఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది. అలాగే ఐఫోన్ 6ఎస్ లేదా, ఐఓఎస్ 13 ఉన్న డివైస్‌లకు మాత్రమే ఓఎస్ అప్‌డేటెడ్ యాపిల్ వాచ్‌లు కనెక్ట్ అవుతాయి.

Best Mobiles in India

English summary
Apple's New Computer Looks Like A Cheese Grater, And People Are Trolling It Like Mad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X