పోర్న్ సైట్లు ఓపెన్ చేసి చూశాడు, దిమ్మతిరిగి పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తాడు

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో సాధారణం కావడం అలాగే డేటా కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

|

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో సాధారణం కావడం అలాగే డేటా కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో పాటు ఖాళీ సమయంలో చాలామంది ఆ వీడియోలకు అడిక్ట్ అవుతున్నారు. అలా అడిక్ట్ అయినందుకు ఓ టెకి ( భద్రత కోసం పేరు ఇవ్వడం లేదు) భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బెంగుళూరులో నివసించే ఓ టెకీ ఖాళీ సమయంలో నెట్‌లో పోర్న్‌ సైట్లు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇది ఇలా కొనసాగుతుండగా అతని అకౌంట్ ని హ్యాక్ చేసిన హ్యాకర్ మూడు చెరువులు నీళ్లు తాగించాడు.. ఈ మెయిల్ ద్వారా అతని రహస్యాలను పంపించి బిట్ కాయిన్లు చెల్లించాలని ఎరవేశాడు. పూర్తి వివరాల్లోకెళితే..

ఐఫోన్ Xని సవాల్ చేస్తున్న ఎల్‌జి హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ఐఫోన్ Xని సవాల్ చేస్తున్న ఎల్‌జి హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌

కంప్యూటర్‌లోకి హ్యాకర్‌

కంప్యూటర్‌లోకి హ్యాకర్‌

బెంగుళూరు టెకీ నెట్‌లో పోర్న్‌ దృశ్యాలు చూస్తున్న సమయంలో అతని కంప్యూటర్‌లోకి హ్యాకర్‌ ప్రవేశించాడు. వెబ్‌ కెమెరాను తన కంట్రోల్‌లోకి తీసుకొన్నాడు. అతని కాంటాక్ట్‌ లిస్ట్‌ను హ్యాక్‌ చేశాడు.

అతని వ్యక్తిగత దృశ్యాలను..

అతని వ్యక్తిగత దృశ్యాలను..

టెకికు తెలియకుండానే వెబ్‌ కెమెరా సాయంతో అతని వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్‌ చేశాడు. దాని ఆధారంగా ఒక సెక్స్‌ టేప్‌ను సిద్ధం చేశాడు.

2200 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను

2200 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను

దాన్ని మెయిల్‌కు పంపి 2200 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను చెల్లించు. లేదంటే నీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికీ, కుటుంబ సభ్యులకు ఈ సెక్స్‌ వీడియో పంపుతానని బెదిరించాడు.

తొమ్మిది సోర్సుల నుంచి..

తొమ్మిది సోర్సుల నుంచి..

ఇదో ఫేక్‌ ఈమెయిల్‌గా భావించిన టెకీ.. ఎందుకైనా మంచిదని కంప్యూటర్‌లోని పర్సనల్‌ విషయాలు భద్రంగా ఉన్నాయో లేవో చూసుకొన్నాడు. తొమ్మిది సోర్సుల నుంచి తన కాంటాక్ట్స్‌ హ్యాక్‌ అయ్యాయని తెలుసుకొని కంగుతిన్నాడు.

బెంగళూరు పోలీసుల ఫేస్‌బుక్‌ పేజీలో..

బెంగళూరు పోలీసుల ఫేస్‌బుక్‌ పేజీలో..

వెంటనే బెంగళూరు పోలీసుల ఫేస్‌బుక్‌ పేజీలో ఈమెయిల్‌ కాపీని పోస్ట్‌ చేశాడు.పోలీసులు ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరో టెకీకి ఇలాంటి పరిస్థితే ..

మరో టెకీకి ఇలాంటి పరిస్థితే ..

ఇలాంటి అనుభవం ఈ మధ్యే మరో టెకీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హ్యాకర్‌ వెయ్యి డాలర్ల బిట్‌కాయిన్లు డిమాండ్‌ చేశాడు.

పోర్న్‌ సైట్ల ద్వారానే ..

పోర్న్‌ సైట్ల ద్వారానే ..

హ్యాకర్లు ఎక్కువగా పోర్న్‌ సైట్ల ద్వారానే మన ఫోన్లు, కంప్యూటర్లలోకి ప్రవేశిస్తున్నారు. 

బెదిరింపులకు లొంగకపోతే

బెదిరింపులకు లొంగకపోతే

మనం వారి బెదిరింపులకు లొంగకపోతే రహస్యంగా రికార్డు చేసిన దృశ్యాల తాలూకూ స్క్రీన్ షాట్లు పంపుతున్నారు.

ఆన్‌లైన్‌లో..

ఆన్‌లైన్‌లో..

ఒకప్పుడు ఆన్‌లైన్‌లో లాటరీలు, గిఫ్ట్‌ల పేరుతో జరిగే మోసాలపై ఫిర్యాదులు వచ్చేవి.

కొత్త తరహా నేరాలకు హ్యాకర్లు..

కొత్త తరహా నేరాలకు హ్యాకర్లు..

కానీ కొత్త తరహా నేరాలకు హ్యాకర్లు దిగడంతో ఆ మేరకు ప్రజలను చైతన్య పర్చాల్సిన అవసరం ఉందని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Cam hacker asks techie to send $2,200 in bitcoins More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X