మార్కెట్లోకి సెన్‌హైజర్ XS 1 మైక్రోఫోన్

|

ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ కంపెనీ సెన్‌హైజర్, wired XS 1 పేరుతో సరికొత్త డైనమిక్ మొక్రోఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా సెన్‌హైజర్ ఇండియా డైరెక్టర్ విపిన్ పుంగాలియా మాట్లాడుతూ XS 1 మైక్రోఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు.

 
మార్కెట్లోకి  సెన్‌హైజర్  XS 1 మైక్రోఫోన్

ఈ ఎంట్రీ లెవల్ మైక్‌.. ఈవెంట్ హోస్టింగ్స్‌తో పాటు ఇతర ప్రెజంటేషన్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఆయన తెలిపారు. సంగీతాన్ని ప్రొఫెషన్‌గా ఎంచుకుంటోన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో సెన్‌హైజర్ మైక్రోఫోన్‌ల అమ్మకాలు భారత్‌లో అసాధారణ రీతిలో పెరుగుతున్నట్లు విపిన్ పుంగాలియా వెల్లడించారు. జర్మనీకి చెందని సెన్‌హైజర్ కంపెనీకి భారత్ రెండవ అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఆధునిక కమ్యూనికేషన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన XS 1 మైక్రోఫోన్ సౌండ్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడదని కంపెనీ చెబుతోంది. ఈ మైక్రోఫోన్ డివైస్‌ లాకబుల్ మ్యూట్ స్విచ్‌తో పాటు స్టాండ్ మౌంట్ అలానే leatherette పౌచ్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. 'silent mute switch’ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా యూజర్‌కు 'sound transmission’ పై పూర్తి కంట్రోల్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Oppo F5 లాంచ్ అయ్యింది, ధర రూ.19,990Oppo F5 లాంచ్ అయ్యింది, ధర రూ.19,990

మెటల్ బాడీతో వస్తోన్న ఈ మైక్రోఫోన్ పూర్తి బ్యాలన్సింగ్‌‌ను కలిగి ఉండటంతో పాటు హైక్వాలిటీ ఆన్-స్టేజ్ సౌండ్ లెవల్స్‌ను ఆఫర్ చేయగలుగుతుందట. ఈ మైక్రోఫోన్‌లో పొందుపరిచిన cardioid pickup pattern అవసరం లేని శబ్థాలకు సంబంధించి అదనపు ఐసోలేషన్‌ను ప్రొవైడ్ చేసి అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ రిజెక్షన్‌ను అందిస్తుందని సెన్‌హైజర్ చెబుతోంది. స్విచ్ అవసరం లేదనుకుంటే మైక్రోఫోన్‌ను "On" పొజీషన్‌లో సెక్యూర్‌గా లాక్ చేసుకునే వీలుంటుందట.

Best Mobiles in India

Read more about:
English summary
The XS 1 cardioid dynamic microphone is delivered with a stand mount and a leatherette pouch for transport.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X