ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ కోసం ‘సిసేమ్ ఎనేబుల్’ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ కోసం ‘సిసేమ్ ఎనేబుల్’ స్మార్ట్‌ఫోన్

ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ కోసం సిసేమ్ ఎనేబుల్ అనే ఇస్రాయెల్ కంపెనీ పూర్తి హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. వెన్నుముక గాయాలు, అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) సెరిబ్రల్ పక్షవాతం తదితర ఇతర వైకల్యాలతో భాదపడుతున్న వారికి ఈ ఫోన్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ కోసం ‘సిసేమ్ ఎనేబుల్’ స్మార్ట్‌ఫోన్

ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన ప్రొప్రైటరీ హెడ్ ట్రాకింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫోన్ లోని ఆధునిక కంప్యూటర్ విజన్ అల్గోరిథం అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజర్ తల కదలికలను ట్రాక్ చేసి అందుకు అనుగుణంగా ఫోన్ ను కంట్రోల్ చేసుకునేందుకు ఉపకరిస్తాయి.

ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ కోసం ‘సిసేమ్ ఎనేబుల్’ స్మార్ట్‌ఫోన్

ఈ 1000 డాలర్ ఫోన్ తాజాగా రూ.6 కోట్ల బహుమతిని గెలుపొందింది. ఈ ఫోన్ డెవలపర్ గయోరా లివ్నీ కూడా ఫిజికల్లీ ఛాలెంజెడ్ కావటం విశేషం. ఈ ఆవిష్కరణతో నా జీవిన నాణ్యత రాతి యుగం నుంచి స్మార్ట్‌ఫోన్ యుగానికి వచ్చినట్లుందని గయోరా లివ్నీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

English summary
Sesame Enable is the world’s first hands-free smartphone for disabled. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot