Home
News

Emergency alert మీ ఫోన్‌లకు ఇటువంటి మెసేజ్‌ వచ్చిందా.. అస్సలు స్పందించవద్దు..!!

ఎమర్జెన్సీ అలెర్ట్‌ పేరుతో ఇవాళ మధ్యాహ్నం (ఆగస్టు 17 గురువారం) 1:35 గంటలకు దేశవ్యాప్తంగా చాలా మంది ఫోన్లకు ఒక ఎమర్జెన్సీ మెసెజ్‌ వచ్చింది. అయితే ఈ మెసేజ్‌ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎందుకు వచ్చింది అని చాలా మంది కంగారు పడ్డారు.

భారత టెలి కమ్యూనికేషన్‌ శాఖకు చెందిన సెల్‌ బ్రాడ్‌ కాస్ట్‌ సిస్టమ్‌ ఈ శాంపిల్‌ మెసెజ్‌ పంపినట్లు తెలిసింది. ఈ మెసేజ్‌పై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీ) ఇటీవల ఈ వ్యవస్థను రూపొందించింది.

several mobile phones received Emergency alert

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వారి భద్రతను మెరుగుపరచడంలో భాగంగా నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీ ఈ మెసేజ్‌ను దేశ వ్యాప్తంగా పరీక్ష చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా భారత్‌లోని అనేక ప్రాంతాల్లోని మొబైల్‌ ఫోన్లకు ఈ మెసేజ్‌ను పంపించారు.

వివిధ మొబైల్‌ ఆపరేటర్లు, సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ సిస్టమ్‌ పనితీరు, సమర్థతను పరీక్షించేందుకు వీలుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని ఈ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని టెలి కమ్యూనికేషన్‌ శాఖ గతంలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా శాంపిల్‌ మెసేజ్‌ పంపినట్లు తెలిసింది.

సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ అలెర్ట్‌ సిస్టమ్‌ అనేది ఒక ప్రాంతంలోని నివాసం ఉంటున్న ప్రజలు, ఆ ప్రాంతానికి వచ్చిన అతిథులు సహా ఇతరుల ఫోన్లకు అత్యవసర సహా సున్నితమైన సమాచారాన్ని పంపించేందుకు రూపొందించిన వ్యవస్థ. అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రజలకు సమాచారం చేరవేసేందుకు ఈ వ్యవస్థ సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ వ్యవస్థను ప్రభుత్వ సంస్థలు మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహా అత్యవసర సేవల విభాగాలు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ సిస్టమ్‌... సునామీ, వరదలు, భూకంపాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడనుంది.

సాధారణంగా సునామీ, వరదలు వంటి సమయంలో ప్రజలను వీలైనంత వేగంగా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. మరియు వీలైనంత వేగంగా ప్రజలను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అలాంటి సమయంలో వేగంగా ప్రజలకు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. ఈ సెల్‌ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ అలాంటి సందర్భాల్లో మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది.

టెలి కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌ ఉపాధ్యాయ ఈ అత్యవసర సందేశంపై స్పందించారు. ప్రస్తుతం ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనే అందుబాటులో ఉందని చెప్పారు. C-DOT ఈ వ్యవస్థను దేశీయంగా అభివృద్ది చేసినట్లు చెప్పారు. నేరుగా ఫోన్లకు అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అమలు చేయబడుతుందని తెలిపారు. ప్రస్తుతం జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లతో పరీక్షించబడినట్లు చెప్పారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
several mobile phones received Emergency alert severe sent by national disaster management authority
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X