స్కూల్‌లో నగ్న చిత్రాలను పంపిన, రిసీవ్ చేసుకున్నశిక్ష పడుతుంది

Posted By: Staff

స్కూల్‌లో నగ్న చిత్రాలను పంపిన, రిసీవ్ చేసుకున్నశిక్ష పడుతుంది

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా స్టేటే సెనేట్ వినూత్నంగా ఓ బిల్‌ని పాస్ చేసింది. సెనేట్ పాస్ చేసిన ఆ బిల్ ఏమిటంటే స్కూల్ సమయాలలో సెల్ ఫోన్‌తో పిల్లలు ఏమి చేస్తున్నారనేది చూడడం. ఈ బిల్ పేరు SB919. దీనికి ముద్దుగా సెనేట్ పెట్టిన పేరు 'సెక్స్‌టింగ్'. సెక్స్‌టింగ్ అంటే సెక్సుకు సంబంధించినటువంటి పిక్చర్స్, వీడియోస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పంపించుకోవడం, రిసీవ్ చేసుకోవడం లాంటివి అన్నమాట. సెనేటర్ టెడ్ లియు పాస్ చేసినటువంటి ఈ బిల్ పై అసెంబ్లీ అంతా ఆమోద ముద్ర వేసింది.

దీనివల్ల కాలిఫోర్నియా లా ప్రకారం స్కూల్స్‌కి వచ్చే టప్పుడు గానీ, స్కూల్ నుండి వెళ్శిపోయేటప్పుడు గానీ, లంచ్ బ్రేక్‌లో గానీ, గ్రౌండ్స్‌లో ఆటలాడుకునేటప్పుడు గానీ, ఏమైనా స్కూల్ స్పాన్సర్ యాక్టివిటీస్‌లో గానీ స్కూలు విద్యార్దులు పైన చెప్పినటువంటి సెక్స్ టింగ్ గనుక చేసినట్లైతే వారిని కఠినంగా శిక్షించవచ్చునని ఆదేశాలు జారీ చేశారు. పైన చెప్పిన సందర్బాలలో పిల్లలు గనుక సెక్సుకు సంబంధించినటువంటి పిక్చర్స్, వీడియోస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పంపించుకోవడం, రిసీవ్ చేసుకోవడం లాంటివి చేసినట్లైతే స్కూల్ యాజమాన్యం వారిని శిక్షిస్తుంది.

ఈ సందర్బంలో సెనేటర్ టెడ్ లియు మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రస్తుతం యూత్‌లో ఉన్న ప్రాబ్లమ్. మాకు అందిన రిపోర్ట్ ప్రకారం 20శాతం మంది టీనేజర్స్ వారియొక్క నగ్న చిత్రాలు, అర్దనగ్న చిత్రాలు, వీడియోలను వారంతట వారే కొన్ని వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటన్నింటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot