సోయగాల భామలతో పాఠాలు!

Posted By: Staff

సోయగాల భామలతో పాఠాలు!

 

ప్రపంచంలోని కఠినమైన భాషల్లో ఒకటైన మాండరిన్ (చైనా అధికార భాష)ను విద్యార్థులకు సులువుగా నేర్పించేందుకు ఆ దేశానికి చెందిన కరూ కికుచి ఓ సెక్సీ మార్గాన్ని కనుగొన్నాడు. అదేంటో తెలుసా..? అందమైన భామలతో భాషను బోధించడం. అది కూడా కురచ దుస్తుల్లో. ఈ ఆలోచన తన మదిలో తట్టినే వెంటనే కికుచీ ‘సెక్సీమాండరిన్.కామ్’ అనే ఆన్‌లైన్ పాఠశాలను ప్రారంభించేశాడు.

ఈ ఆన్‌లైన్ పాఠశాలలో శృంగారానుభూతికి లోనేచేసే సెక్సీ భామలతో పాటు మిస్టర్ ఫెంగ్ అనే కార్టూన్ ప్రాత పాఠాలను బోధిస్తుంది. మత్తెకించే వయ్యారాలతో ఆ భామలు పలికే చిలక పలుకులను ఈ కార్టూన్ పాత్ర మనకు వివరిస్తుంది. ఇంకేముంది ఈ ఆన్‌లైన్ స్కూల్ పెద్ద హిట్టే అయ్యింది. అది ఏంతాలా అంటే. ఒక్క పాఠ్యాంశానికి ఏకంగా 3 లక్షల హిట్లు వచ్చాయంట. అత్యంత సంక్లిష్టమైన మాండరిన్ భాషను అత్యంత సులువుగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలనుకునే వారు ఈ సైట్‌ను ఆశ్రయిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot