ట్విట్టర్‌ని వదిలేసి పేస్‌బుక్‌లో పేజి క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్ షా..

Posted By: Super

ట్విట్టర్‌ని వదిలేసి పేస్‌బుక్‌లో పేజి క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్ షా..

ముంబై: బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త పంధాకి నాంది పలికారు. 8లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ట్విట్టర్‌ని వదిలిపెట్టి కింగ్ ఖాన్ షారుఖ్ ఇప్పుడు ప్రపంచంలో కెల్లా ఎక్కువమంది కలిగినటువంటి సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్‌లో తన ఖాతాని ఓపెన్ చేశారు. మార్చి 18వ తారీఖు శుక్రవారం 22నిమిషాలు నిడివి కలిగినటువంటి మొగల్-ఎ-ఆజామ్ సినిమా ఆన్‌లైన్ ప్రీమియర్ తోటి తన ఖాతాని ఫేస్‌బుక్‌లో లాంఛనంగా ఓపెన్ చేశారు.

షారుఖ్ ఖాన్ ఫేస్‌బుక్‌లో పేజి ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం తన పేజి ద్వారా ఇండియన్ క్లాసికల్ సినిమాల కోసం తనదైన శైలిలో ఈ ఫేస్‌బుక్‌ పేజిని ఉపయోగించనున్నారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ క్లాసికల్ సినిమాల మీద ఓ ఫోరమ్‌ని కూడా త్వరలో పెట్టనున్నట్లు సమాచారం. దీనికి గాను ఇండియన్ గవర్నమెంట్, ఫిల్మ్ అసోషియేసన్స్ కూడా వాటి వంతు సహాకారాన్ని అందిస్తాయని ఆయన ఆశిస్తున్నట్లు వినికిడి. ఈవిధంగా షారుఖ్ చేయడం వల్ల ఫేస్‌బుక్‌‌కి కూడా ఇంకా అభిమానులు పెరిగే అవకాశం ఉంది.

ఇది మాత్రమే కాకుండా 2011లో విడుదలయ్యేటటువంటి తన సినిమా రా వన్‌ని కూడా ఇందులో ప్రమోట్ చేయనున్నారని సమాచారం. ఏది ఐతేనేం మన బాలీవుడ్ బాద్షా ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పేజిలో ఉండడం వల్ల యావత్ షారుఖ్ అభిమానులు అభినందించదగ్గ శుభపరిమాణం. రాబోయే కాలంలో షారుఖ్‌ని అనుసరించి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు కూడా ఫేస్‌బుక్‌లో పేజిని ఓపెన్ చేస్తారేమా చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot