కూరగాయల ధరలు కొసం ప్రత్యేకంగా మైక్రో బ్లాగ్

Posted By: Super

కూరగాయల ధరలు కొసం ప్రత్యేకంగా మైక్రో బ్లాగ్

బీజింగ్: షాంఘై లోకల్ గవర్నమెంట్ సోమవారం మొదటి అధికారిక మైక్రో బ్లాగ్‌ని ప్రజల కొసం ఓపెన్ చేసింది. ఈ మైక్రో బ్లాగ్ ద్వారా ప్రజలకు గవర్నమెంట్ కొత్త విధివిధానాలను, రాబోయే కల్చరల్ ఈవెంట్స్‌కి సంబంధించిన సమాచారంతో పాటు రోజువారీ కూరగాయల ధరలు తెలియజేయనున్నారు. చైనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మైక్రో బ్లాగ్ పేరు 'షాంఘై సిటి'. ట్విట్టర్ మాదిరి చైనాలో బాగా పాపులర్ సర్వీస్ అయిన వైబో.కామ్ ద్వారా ఈ మైక్రో బ్లాగ్‌ని అధికారకంగా విడుదల చేయడం జరిగింది.

షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ అధికారిక మైక్రో బ్లాగ్‌ విడుదల చేసిన ఐదు గంటలలో సుమారు 30,000 మంది ఫాలోవర్స్ ఫాలో అవడం జరిగింది. షాంఘై గవర్నమెంట్ ఎటువంటి సమాచారం అందివ్వాలన్నా ఈ మైక్రో బ్లాగ్ ద్వారా అధికారకంగా ప్రకటిస్తారు. ఇది మాత్రమే కాకుండా యూజర్స్ కూడా షాంఘై సిటీలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లైందుకు ఈ మైక్రో బ్లాగు చక్కగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీనిని ప్రారంభించడం జరిగిందన్నారు

దీనితోపాటు షాంఘై సిటీ మెట్రో కోసం ప్రత్యేకంగా మరో వెబ్ సైట్‌ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు 'షాంఘై మెట్రో'. ఈ మైక్రో బ్లాగ్ వెబ్ సైట్ ద్వారా సిటీ మెట్రోకి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ప్రజలకు అందివ్వడం జరుగుతుంది. షాంఘై మెట్రో వెబ్ సైట్‌ని సుమారు 1.15మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవడం జరుగుతుంది. చైనా మొత్తం మీద సుమారు 300మిలియన్ రిజిస్టర్ మైక్రో బ్లాగ్ యూజర్స్ ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot