గూగుల్‌ను కలవరపెడుతోన్న సొర చేపలు

Posted By:

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను సొర చేపలు కలవరపెడుతున్నాయి. ప్రపంచదేశాలకు అంతర్జాలం (ఇంటర్నెట్) అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు ధ్వంసం చేస్తున్నాయట. ఈ భయానక సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించింది.

 గూగుల్‌ను కలవరపెడుతోన్న సొర చేపలు

సముద్ర గర్భంలో ఏర్పాటు చేయబడని ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే పదార్థం) తరహా తొడుగును గూగుల్ వర్గాలు అమర్చనున్నాయి. ఈ సరికొత్త రక్షణాత్మక వ్యవస్థను అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. సముద్రంలో ఏర్పాటు చేయబడని కేబుల్ వ్యవస్థను సొర చేపలు ధ్వంసం చేస్తున్నాయనే విషయం 1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1ex7uTQf4bQ? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot