ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ STBలో కొత్త ఛానెల్‌ల చేరికలో షెమరూ FTA ఛానెల్‌...

|

ఇండియాలోని అత్యుత్తమ డిటిహెచ్ ఆపరేట్లలో ఒకటైన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన యొక్క వినియోగదారుల కోసం అనేక రకాల సేవలను అందిస్తున్నది. టీవీ ఛానెళ్ల కోసం మీరు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీని ఉపయోగిస్తుంటే కనుక ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం అప్‌డేట్ చేసిన కొన్ని కొత్త ఛానెల్‌ల గురించి తెలుసుకోవడం మీకు ఆనందంగా ఉంటుంది.

 

DTH ఆపరేటర్

ఈ DTH ఆపరేటర్ ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఛానెల్‌లను జతచేయడం మరియు ఉన్న వాటిని తీసివేయడం చేస్తూ ఉంటుంది. కొన్ని ఛానెల్‌ల అభిమానులు మరియు వీక్షకులు వినోదం కోసం కొత్త అప్‌డేట్ల మీద ఆధారపడటం కొత్త కాదు. తాజా ఎత్తుగడలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కొన్ని ఛానెళ్లను తమ ప్లాట్‌ఫామ్‌లో చేర్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon CEO 'జెఫ్ బెజోస్' అంతరిక్ష ప్రయాణ రాకెట్ లాంచ్ లైవ్ చూడడం ఎలా?Amazon CEO 'జెఫ్ బెజోస్' అంతరిక్ష ప్రయాణ రాకెట్ లాంచ్ లైవ్ చూడడం ఎలా?

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో జతచేసిన కొత్త ఛానెల్‌లు
 

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో జతచేసిన కొత్త ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు కొత్తగా జోడించబడిన ఛానెల్‌ల జాబితాలో మొదటిది దేవమ్‌ ఛానెల్ ఉంది. ఈ ఛానెల్ ఇతర ఛానెల్‌ల మాదిరిగానే చందాదారులకు ఆధ్యాత్మిక కంటెంట్‌ను అందిస్తుంది. ఈ దేవం ఛానెల్ LCN 684 నెంబర్ వద్ద ఉచితంగా లభిస్తుంది. అంటే చందాదారులు తమ వాచ్ జాబితాలో చేర్చడానికి అదనపు చందా ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు మిడ్‌రేంజ్ ఫోన్ బెస్ట్!! ఎందుకో తెలుసా??కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు మిడ్‌రేంజ్ ఫోన్ బెస్ట్!! ఎందుకో తెలుసా??

షెమరూ టీవీ ఛానెల్ చేరిక

షెమరూ టీవీ ఛానెల్ చేరిక

కొత్తగా జోడించబడిన ఛానెల్‌ల జాబితాలో తదుపరిది షెమరూ టీవీ ఛానెల్. చందాదారులు ఇప్పుడు దీనిని ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెట్-టాప్ బాక్స్‌ ద్వారా కూడా పొందగలుగుతారు. షెమరూ కంటెంట్ ఇప్పటివరకు OTT ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లభించేది. ఇందులో చందాదారులు హిందీ సినిమాలు మరియు ఇతర బాలీవుడ్ సినిమాలను చూడగలరు. అందువల్ల ఇది GECs వర్గంలోకి వస్తుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క చందాదారులు ఈ ఛానెల్‌ను FTA ఛానెల్‌గా ఆస్వాదించగలుగుతారు. అంటే వారు దీన్ని చూడటానికి అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో తొలగించిన ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో తొలగించిన ఛానెల్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌ నుంచి కొన్ని ఛానెల్‌లను కూడా తెసివేసింది. వీటి యొక్క వివరాల విషయానికి వస్తే మీరు తరచూ దేవ్‌డూట్ ఛానెల్‌ను చూస్తుంటే కనుక ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఇప్పుడు ఆ ఛానెల్‌ను తొలగించింది. ఇతర వివరాలలోకి వస్తే మీరు కొత్త డిటిహెచ్ కనెక్షన్ కోసం ఎయిర్‌టెల్ డిజిటల్ టివి సెట్-టాప్ బాక్స్‌ను పొందాలని చూస్తున్నట్లయితే కనుక డిటిహెచ్ ఆపరేటర్ దాని కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే కస్టమర్‌ల కోసం తగ్గింపు ధరను అందిస్తున్నది అని మీరు గమనించాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Shemaroo and Devam FTA Channels Add in Airtel Digital TV STB

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X