Home
News

క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అంబానీ షాకింగ్ డెసిషన్.. ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్‌కు ఎండ్ కార్డ్..!

No More Free IPL: ఇంతకాలం ఫ్రీగా ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. 2025 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లు ఫ్రీగా చూడటం కుదరదు. ఈ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా ప్రసారం చేయకూడదని అంబానీ నిర్ణయించారు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్లు కలిసిపోయి జియోస్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చింది.

అంటే ఇకపై డబ్బులు కడితేనే ఐపీఎల్ మ్యాచ్‌లు చూడగలం. 2023 నుంచి జియో సినిమా ఐపీఎల్‌ను ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఇందుకోసం వాళ్లు డిజిటల్ రైట్స్ కోసం అక్షరాలా 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.26,000 కోట్లు) ఖర్చు చేశారు. ఐదేళ్ల పాటు ఫ్రీగా చూపిస్తామని చెప్పారు. కానీ మాట మార్చారు.

Shock for Cricket Lovers  No More Free IPL Streaming on JioCinema or Hotstar

2024లో రిలయన్స్, వాల్ట్ డిస్నీ సంస్థలు కలిసిపోయి 8.5 బిలియన్ డాలర్ల భారీ డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో పాలసీలు కూడా మారిపోయాయి. ఐపీఎల్ 2025 నుంచి మ్యాచ్‌లు చూడాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఫ్రీగా చూడటం కుదరదు. అయితే పూర్తిగా ఫ్రీ స్ట్రీమింగ్ బంద్ చేయలేదు.

* కొన్ని నిమిషాలు ఫ్రీ

రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్ మొదట్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఫ్రీగా చూసే అవకాశం ఇస్తారు. ఆ వెంటనే సబ్‌స్క్రిప్షన్ తీసుకోమని అడుగుతారట. ప్లాన్స్ విషయానికొస్తే.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.149 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఒక్కొక్క యూజర్ అలవాట్లను బట్టి ఫ్రీగా ఎంతసేపు చూడొచ్చనేది మారుతూ ఉంటుందని సమాచారం.

ఈ విషయంపై రిలయన్స్ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, లోలోపల మాత్రం యూజర్లను బాగా పెంచుకున్నాక, ఆ తర్వాత డబ్బులు వసూలు చేయాలనేది వాళ్ల ప్లాన్ అని తెలుస్తోంది. అందుకే మొదట్లో ఫ్రీగా చూపించి ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ పెట్టినట్టు ఉన్నారు.

* జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ విషయానికొస్తే.. రీబ్రాండెడ్ యాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాన్. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద రూ.149కే వస్తుంది. రెండోది యాడ్-ఫ్రీ ప్లాన్. యాడ్స్ లేకుండా చూడాలంటే రూ.499 కట్టాలి. ఇది మూడు నెలల ప్లాన్.

జియో హాట్‌స్టార్‌లో క్రికెటే కాదు.. మిగతా స్పోర్ట్స్ కూడా చూడొచ్చు. ఐసీసీ టోర్నమెంట్లు, ఐపీఎల్, WPL లాంటి మేజర్ క్రికెట్ ఈవెంట్స్‌కు జియో హాట్‌స్టార్ మెయిన్ అడ్డాగా మారనుంది. అంతేకాదు, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, బీసీసీఐ, ఐసీసీ పాత్‌వే మ్యాచ్‌లు వంటి లోకల్ క్రికెట్ టోర్నీలను కూడా ఇందులో చూడొచ్చు.

* కొత్త ఫీచర్లతో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్

క్రికెట్‌తో పాటు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ISL వంటి ఇతర క్రీడా టోర్నీలు కూడా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఇంకా చూసే అనుభూతి కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. జియో హాట్‌స్టార్ అదిరిపోయే ఫీచర్లతో రాబోతోంది. అవేంటంటే.. అల్ట్రా-HD 4K స్ట్రీమింగ్, AI-పవర్డ్ ఇన్సైట్స్ & రియల్-టైమ్ స్టాట్స్.

మ్యాచ్ జరుగుతుండగానే AI టెక్నాలజీతో ఇన్సైట్స్, లైవ్ స్టాట్స్ చూపిస్తారు. మల్టీ-యాంగిల్ వ్యూయింగ్‌తో ఒకే మ్యాచ్‌ని వేర్వేరు యాంగిల్స్‌లో చూడొచ్చు. మీ ఇష్టానికి తగ్గ కంటెంట్ మీకు దొరుకుతుంది. మొత్తానికి ఐపీఎల్ ఫ్రీగా చూడటం బంద్ చేయడం అనేది ఇండియన్ క్రికెట్ అభిమానులకు పెద్ద దెబ్బే.

2024 వరకు జియో సినిమాలో ఫ్రీగా చూసిన వాళ్లంతా ఇప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది. జియో హాట్‌స్టార్ రాకతో సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలకు కూడా జియో భారీ షాక్ ఇచ్చింది. ఈ పోటీల నడుమ ధరలు తగ్గే అవకాశం ఉండొచ్చు.

Best Mobiles in India

English summary
JioHotstar ends free IPL streaming from 2025, requiring subscriptions starting at Rs 149. This follows the JioCinema and Disney+ Hotstar merger, aiming to enhance user experience with features like 4K streaming.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X