వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

Posted By:

వై-ఫై, ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్న దాదాపు చాలామందికి ఈ పదం సుపరిచితం. వై-ఫై (వైర్ లెస్ ఫెడిలిటీ), ఈ సాంకేతిక ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్‌ను సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లకు వైర్ల సహాయం లేకుండా విస్తరించుకోవచ్చు. ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

1997లో వై-ఫై టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమైంది. వై-ఫై సాంకేతికత మరింతగా విస్తరించినప్పటికి ఈ సాంకేతికత పై అనేక ఆరోగ్యపరమైన సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వై-ఫై, మనిషి ఆరోగ్యం పై ఏ విధమైన ప్రభావం చూపుతోంది అనే అంశం పై రకరకాల పరిశోధనను నిపుణులు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో వెల్లడైన షాకింగ్ నిజాలు వై-ఫై వినియోగం ఆసక్తికర విజయాలను వెలుగులోకి తీసుకువచ్చాయి.

వై-ఫై వినియోగం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని ముఖ్యంగా చిన్నారుల మెదడుకు సంబంధించి ఆరోగ్యం పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలు తేల్చిచేప్పాయి. 2008లో ప్రముఖ పబ్లికేషన్ సైంటిఫిక్ అమెరికన్ మనిషి మెదడు పై వై-ఫై చూపుతోన్న ప్రభావాన్ని విశ్లేషిస్తూ ‘మైండ్ క్రంటోల్ బై సెల్‌ఫోన్' పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. పరిశోధనల్లో భాగంగా పలు అధ్యయనాలు తమ నివేదికల్లో వెల్లడించిన వివరాలు మేరకు వై-ఫై వినియోగం కారణంగా తలెత్తే అవకాశమున్న పలు ఆరోగ్య సమస్యల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిద్రలేమి

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై వినియోగం నిద్రలేమి సమస్యను పెంచే అవకాశముంది. 2007లో నిర్వహించిన ఓ స్టడీలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి

చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ పై ప్రభావం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై ఇంకా మొబైల్ ఫోన్‌ల ద్వారా విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియోషన్ చిన్నపిల్లల ఎదుగుదల (చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్) పై ప్రభావం చూపు అవకాశముందని 2009లో ఓఆస్ట్రియన్ స్టడీ వెల్లడించింది.

 

కణాల పెరుగుదల పై ప్రభావం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై కణాల పెరుగుదల పై ప్రభావం చూపుతుందని ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. డానిష్ ప్రాంతానికి చెందిన పలువురు 9వ తరగతి విద్యార్థులు రాత్రుళ్లు సెల్ ఫోన్ లను తమ తలల క్రింద పెట్టుకుని నిద్రపోవటం ద్వారా ఈ సమస్యను గుర్తించారు.

 

మెదడు పనితీరు పై ప్రభావం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

4జీ రేడియేషన్ మెదడు పనితీరు పై ప్రభావాన్ని చూపుతోందనే అనే అంశం పై నిపుణులు ఎమ్ఆర్ఐ టెక్నాలజీ సహాయంతో పలు పరిశోధనలు నిర్వహించారు. 4జీ రేడియేషన్ మెదుడు కార్యకలపాలు పై ప్రభావం చూపుతోందని వీరు నిర్థారణకు వచ్చారు.

 

మహిళల్లో మొదడుకు సంబంధించిన కార్యకలాపాలను తగ్గించే అవకాశం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై రేడియోషన్, మహిళల్లో మొదడుకు సంబంధించిన కార్యకలాపాలను తగ్గించే అవకాశముందని ఓ సాధారణ మెమరీ టెస్ట్ ద్వారా నిపుణులు తెలుసుకున్నారు.

విర్యకణాల వృద్థి పై ప్రభావం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై రేడియోషన్ విర్యకణాల వృద్థి పై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది.

సంతానోత్పత్తి పై ప్రభావం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై రేడియోషన్, సంతానోత్పత్తి పై ప్రభావం చూపే అవకాశముందని పలు అధ్యయనాల్లో రుజువైంది.

గుండె ఒత్తిడి పెరిగే అవకాశం

వై-ఫై రేడియోషన్.. షాకింగ్ నిజాలు

వై-ఫై రేడియోషన్ కారణంగా గుండె ఒత్తిడి పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Shocking Facts about the Health Dangers of Wi-Fi. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot