కంప్యూటర్ వాడని సమయంలో కచ్చితంగా ఆపివేయాలా... వద్దా?

Posted By: Staff

కంప్యూటర్ వాడని సమయంలో కచ్చితంగా ఆపివేయాలా... వద్దా?

అనవసర సమయాల్లో ఆన్ చేసి ఉంచటం వల్ల కంప్యూటరు యొక్క జీవిత కాలం కుదించుకుపోతుంది. ప్రతిసారీ ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడి కూడా దాని జీవిత కాలాన్ని క్షీణిపజేస్తుందనుకోండి. కానీ ఇలా కంప్యూటరు చెడిపోవటానికి మునుపే, వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల అది పతదైపోతుంది. ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడికంటే అతిగా వేడెక్కటం వల్ల కలిగే ప్రమాదమే ఎక్కువ.

రోజంతా ఆన్‌లో ఉంచినప్పుడు, మీరు 4 గంటలు వాడితే మిగిలిన 20 గంటలు కరెంటు వృధా అవుతుంది. సాధారణంగా ఒక కంప్యూటర్ (ల్యాప్ టాప్‌లు మినహా) 300 వాట్ల కరెంటును వాడుకుంటుంది. అంటే దాదాపుగా 8 ట్యూబ్ లైట్లను వాడినంత విద్యుత్తు వాడుతుంది. అంటే యూనిట్టుకు మూడు రూపాయల చొప్పున నెలకు 540 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్ ముందు కూర్చోన్న సమయంలో మానిటర్ అపేసి ఉంచటం వల్ల కర్చు చేసే విద్యుత్తులో సగానికి సగం అదా చేయవచ్చు.

చిట్కాలు (మీరు కంప్యూటర్ వాడుతున్నప్పుడు):
1. వచ్చే 20 నిమిషాలు కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, మానిటర్ను అపివేయండి.
2. వచ్చే 2 గంటలలో కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, కంప్యూటర్‌ను పూర్తిగా అపివేయండి.
3. త్వరగా ఆన్ కావాలంటే, స్లీప్ మోడ్ లేదా స్టాండ్ బై లో ఉంచటం చాలా రకాలుగా మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot