4జీ ఫోన్ కొంటున్నారా.. లేక 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా ?

By Gizbot Bureau
|

దేశంలో మొబైల్ మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. గ్లోబల్ కంపెనీల చూపంతా ఇప్పుడు ఇండియా మీదే ఉంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు దిగ్గజ కంపెనీలు అన్నీ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగానే లేటెస్ట్ టెక్నాలజీతో తమ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి దించుతున్నాయి. ఈ వరసలో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ముందు వరసలో ఉంది. ఆ కంపెనీ OEMsతో ఈ ఏడాది ఫ్లాగ్ షిప్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కొన్ని ఫోన్లను లాంచ్ చేసింది కూడా. Galaxy S10, S10+, and the S10e వంటి ఫోన్లు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అలాగే ఇతర కంపెనీలు nePlus, Sony, LG, and Huawei కంపెనీలు కూడా ఈ ఫీచర్ తో ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇండియాలో త్వరలో ఈ ఫోన్లు లాంయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ తో రానున్న ఫోన్లు 5జీను కూడా సపోర్ట్ చేయనున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో 5జీ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి.

 

శాంసంగ్ 5జీ ఫోన్

శాంసంగ్ 5జీ ఫోన్

శాంసంగ్ నుంచి త్వరలో Samsung Galaxy S10 5G ఫోన్ రానుంది. అదిరిపోయే ఫీచర్లతో ఇది మార్కెట్ లోకి రానుంది. దీంతో పాటుగా హువాయి నుంచి Huawei Mate X పేరుతో ఫస్ట్ 5జీ ఫోన్ రానుంది. అలాగే ఎల్ జి నుంచి LG V50 ThinQ రానుంది. ఈ ఫోన్లు అన్నీ 5జీ ఫీచర్ తో రానున్నాయి. వన్ ప్లస్, ఒప్పో, షియోమి కంపెనీలు కూడా 5జీ ఫోన్ మీద పనిచేస్తున్నాయి. 

5జీ అంటే ఏంటీ ?

5జీ అంటే ఏంటీ ?

5జీ అనేది 4జీ కన్నా వేగవంతమైనది. ఏ ఫైల్ అయినా క్షణాల్లో డౌన్లోడ్ అవుతుంది. QHD resolution movie కూడా నిమిషాల్లోనే డౌన్లోడ్ అవుతాయి. అప్లికేషన్లు అయితే కళ్లు మూసి తెరిచే లోపు ఓపెన్ అయిఉంటాయి. smart home, and console-like gaming, గ్రాఫిక్స్ వంటి విభాగాల్లో 5జీ వేగం ఊహకే అందనిదిగా చెప్పవచ్చు.

ఏ ఫోన్ కోసం చూస్తున్నారు ?
 

ఏ ఫోన్ కోసం చూస్తున్నారు ?

అయితే ఇండియాలో 5జీ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ప్రభుత్వం ఇంకా 5జీ మీద ఎటువంటి ఆక్షన్ ప్రారంభించలేదు. ఢిపరెంట్ టెక్నాలజీస్ 5జీ మీద ప్రయోగాలు చేస్తున్నా అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో సైతం 5జీ ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఎఫ్పుడు ?

ఎఫ్పుడు ?

మీరు 5జీ ఫోన్ కొనుగోల చేయాలంటే 2020 వరకు ఎదురుచూడాల్సిందే. ధర కూడా రూ. 30 వేల లోపే ఉండవచ్చు. 4జీని పూర్తిగా ఆస్వాదించిన తరువాత 5జీని ఆస్వాదించేందుకు రెడీ కావాల్సిందే. 5జీలో వచ్చే ఫీచర్లను చూడాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

Best Mobiles in India

English summary
Should you buy a 4G phone now or wait for 5G phones in India?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X