అనుమ‌తి లేని Signal Jammer ల వినియోగం నేర‌మే.. శిక్ష త‌ప్ప‌దు!

|

భార‌త టెలి క‌మ్యూనికేష‌న్స్ విభాగం (DoT) తాజాగా కీల‌క సూచ‌న‌లు చేసింది. Signal Boosters, వైర్‌లెస్ జామ‌ర్ల వినియోగంపై తాజాగా ప‌బ్లిక్ అడ్వైజ‌రీని జారీ చేసింది. భార‌త్‌లో Signal Jammer, జీపీఎస్ బ్లాకింగ్ ప‌రిక‌రాలు, మ‌రియు ఇత‌ర సిగ్న‌ల్ జామింగ్ పరిక‌రాలు ఉప‌యోగించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని పేర్కొంది. భార‌త ప్ర‌భుత్వం ద్వారా ప్ర‌త్యేకంగా అనుమ‌తి పొంద‌న‌వి త‌ప్ప మిగ‌తా వాటిని ఉప‌యోగించ‌డం చ‌ట్ట వ్య‌తిరేక‌మేన‌ని వెల్ల‌డించింది.

 
అనుమ‌తి లేని Signal Jammer ల వినియోగం నేర‌మే.. శిక్ష త‌ప్ప‌దు!

వారు మాత్ర‌మే వినియోగానికి అర్హులు!
కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా అనుమ‌తి పొందిన పోలీసు బలగాలు, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు మరియు రక్షణ దళాలు వంటి అధికారిక‌ సంస్థలు మాత్రమే సిగ్నల్ జామర్ నమూనాలను కొనుగోలు చేయాలి. ప్రైవేట్ రంగ సంస్థలు మరియు ఇత‌ర బ‌య‌టి వ్యక్తులు Signal Jammer లను ఉపయోగించకూడ‌దు. అంతేకాకుండా, భారతదేశంలో అటువంటి ఉత్పత్తులను బ‌య‌టి వ్య‌క్తులు కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం కూడా చట్టవిరుద్ధ‌మ‌ని డీఓటీ హెచ్చ‌రించింది.

Signal Boosters ను వినియోగించ‌డం చ‌ట్ట విరుద్ధం:
కేవ‌లం సిగ్నల్ జామర్‌లే కాకుండా, సిగ్నల్ బూస్టర్‌ల వాడకంపై కూడా DoT అడ్వైజరీ దృష్టి సారించింది. సిగ్నల్ బూస్టర్లు లేదా రిపీటర్ల ద్వారా, వినియోగదారులు సెల్ ఫోన్ సిగ్నల్ వ్యాప్తిని విస్తరించవచ్చు. కానీ, అటువంటి ఉత్పత్తుల యొక్క అనధికారిక ఉపయోగం పబ్లిక్ టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలిగిస్తుంది. కాబ‌ట్టి, ఇది నెట్‌వర్క్‌ల నాణ్యత మరియు కవరేజీని దెబ్బతీస్తుంది. కాబ‌ట్టి అన‌ధికారిక సిగ్న‌ల్ బూస్ట‌ర్‌ల వినియోగం కూడా చ‌ట్ట విరుద్ధం అని కేంద్ర టెలి క‌మ్యూనికేష‌న్ విభాగం పేర్కొంది.

ఈ సిగ్న‌ల్ బూస్ట‌ర్‌లు పోలీసు బలగాలకు లేదా ఆసుపత్రుల వంటి సంస్థలకు, సామాన్య‌ ప్రజల కీలకమైన ఫోన్ కాల్‌లకు కూడా ప్రమాదం లేదా అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల, వ్యక్తులు మరియు సంస్థలు సిగ్నల్ బూస్టర్‌లను కలిగి ఉండటం చట్టవిరుద్ధమని DoT తెలియజేసింది. దేశంలో ఇటువంటి ఉత్పత్తులను లైసెన్స్ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPలు) మాత్రమే ఉపయోగించ‌డానికి అనుమ‌తి ఉంటుంది. అదనంగా, సిగ్నల్ బూస్టర్‌లను విక్రయించడం మరియు పంపిణీ చేయడం చట్టవిరుద్ధం అని డీఓటీ యాడ్ చేసింది.

అనుమ‌తి లేని Signal Jammer ల వినియోగం నేర‌మే.. శిక్ష త‌ప్ప‌దు!

ఈ ఆదేశాల‌ను ఉల్లంఘించిన వారు కోర్టు ద్వారా శిక్షార్హమైన నేరాల ప‌రిధిలోకి వ‌స్తారు. అంతేకాకుండా ఈ పరికరాలను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడం లేదా ఉపయోగించడం లేదా విక్రయానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే, ఆ విషయంలో అవసరమైన చర్య కోసం ప్ర‌జ‌లు సంబంధిత అధికారుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. ఇందుకోసం వైర్‌లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయవ‌ల‌సి ఉంటుంది. WMO సంప్రదింపు నంబర్ 011-2905-4712, మరియు ఇమెయిల్ ID info.wmohq@gmail.com.

ఈ విష‌యంలో ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన వారిపై వ‌ర్తించే చట్టాలు ఇలా ఉన్నాయి:
ది ఇండియన్ టెలిగ్రాఫీ యాక్ట్, 1885 (సెక్షన్ 20 & ఇతరులు);
ది ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ యాక్ట్, 1933 (సెక్షన్ 6,6.1 & ఇతరులు);
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000;
ప్రభుత్వం యొక్క ఏవైనా ఇతర భద్రతా మార్గదర్శకాలు/నిబంధనలు.

 
అనుమ‌తి లేని Signal Jammer ల వినియోగం నేర‌మే.. శిక్ష త‌ప్ప‌దు!

ఇదే కాకుండా వాట్సాప్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో వేధింపుల‌కు సంబంధించి ఫిర్యాదుల విష‌యంలో కూడా టెలిక‌మ్యూనికేష‌న్ విభాగం ఇదువ‌ర‌కే గ‌తంలో ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. వాటిని ఓ సారి పరిశీలించుదాం.
అశ్లీలమైన, అభ్యంతరకరమైన సందేశాలకు:
అశ్లీలమైన, అభ్యంతరకరమైన సందేశాలకు కూడా అడ్డుకట్ట వేసేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్ గ‌తంలో ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైనా అసభ్యకర మెసేజ్ లు పంపిస్తే జైలు కెళ్లాల్సి ఉంటుంది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కస్టమర్ డిక్లరేషన్‌ ఫారమ్‌లో అంగీకరించిన నిబంధనలను ఉల్లంఘించినట్లే. కనుక ఆ కస్టమర్‌లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికామ్ సంస్థలు అన్నింటికీ గ‌తంలో ఆదేశాలు జారీ చేసింది.

బాధితులు can-dot@nic.inకు:
ఎవ‌రైనా బాధితులు త‌మ స‌మ‌స్య గురించి ఫిర్యాదు చేయాల‌నుకునే వారి కోసం గ‌తంలోనే డీఓటీ ఓ ఈ మెయిల్ ఐడీని విడుద‌ల చేసింది. can-dot@nic.inకు ఇమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే రుజువుగా స్క్రీన్‌షాట్‌లను కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెల్ల‌డించారు.

Best Mobiles in India

English summary
Signal Boosters and Wireless Jammers Illegal in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X