ఈ చొక్కాను ఉతకాల్సిన అవసరం లేదు!!
మీ దుస్తులు భవిష్యత్‌లో వాటంతటకవే శుభ్రపరుచుకోనున్నాయ్! అవును మీరు వింటున్నది నిజమే. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పలువురు నిపుణుల బృందం తమ క్రియేటివ్ మైండ్స్‌తో సరికొత్త ఆవిష్కరణను విజయవంతం చేసారు. ఈ బృందం డిజైన్ చేసిన సిలిక్ షర్ట్ దానంతటకదే శుభ్రపరుచుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ దుస్తు హైడ్రోఫోబిక్ నానోటెక్నాలజీని కలిగి ఉండటం చేత ద్రవాలు ఇంకా ఇతర పదార్థాలు చొక్కా పై నిలిచే అవకాశం ఉండదు. దీంతో ఈ చొక్కా ఎప్పటికప్పుడు కొత్తదిలానే అనిపిస్తుంది.
అమెరికాకు చెందిన ‘వూల్ అండ్ ప్రిన్స్'(Wool&Prince) కంపెనీ ఓ సరికొత్త చొక్కాను రూపొందించింది. దీన్ని 100 రోజులైనా ఉతకకుండా వేసుకోవచ్చట. దీని నుంచి దుర్వాసన రాదట. ఉన్నితో ప్రత్యేకంగా రూపొందించిన ఈ చొక్కాకు మురికి, దుమ్ము అండదట. మొదటి రోజు వేసుకున్నప్పుడు ఏలా ఉందో.. 100వ రోజు కూడా అలానే ఉంటుందట. దీన్ని ఇప్పటికే ఆ సంస్థ వ్యవస్థాపకుడు మాక్ బిషప్ 100 రోజుల పాటు ధరించి పరిశీలించారు కూడా.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ చొక్కాను ఉతకాల్సిన అవసరం లేదు!!
నిపుణుల బృందం డిజైన్ చేసిన సిలిక్ షర్ట్.

ఈ చొక్కాను ఉతకాల్సిన అవసరం లేదు!!
సాధారణ చొక్కాకు, సిలిక్ చొక్కాకు మధ్య తేడాను ఈ ఫోటోలో చూడొచ్చు...

ఈ చొక్కాను ఉతకాల్సిన అవసరం లేదు!!
సిలిక్ చొక్కా నిర్మాణం...
ఈ చొక్కాను ఉతకాల్సిన అవసరం లేదు!!
సిలిక్ షర్ట్ పనితీరు వీడియో రూపంలో...


Click it and Unblock the Notifications








