హైదరాబాద్‌లో సిలికాన్ ఇమేజ్ ఆర్‌అండ్‌డీ సెంటర్

By Prashanth
|
Silicon Image


వైర్‌లెస్, వైర్ హెచ్‌డీ కనెక్టివిటీ (టీవీ, కంప్యూటర్, మొబైల్స్) సొల్యూషన్స్ అందించే అమెరికా కంపెనీ సిలికాన్ ఇమేజ్... హైదరాబాద్‌లో కొత్తగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అమెరికాలోని సన్నీవేల్, చైనాలోని షాంఘైలో కంపెనీకి రెండు ఆర్‌అండ్‌డీ సెంటర్లున్నాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 600. ప్రస్తుతం హైదరాబాద్‌లో కంపెనీకి 80 మంది ఉద్యోగులున్నారు. మరో రెండేళ్లలో హైదరాబాద్ సెంటర్ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపునకు పెంచుతామని సిలికాన్ ఇమేజ్ సీఈవో కెమిలో మార్టినో శుక్రవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు తయారు చేసే మొబైల్, వైర్‌లెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించిన సెమీకండక్టర్, ఐపీ కోర్ టెక్నాలజీలను రూపొందించి, అభివృద్ధి చేయడంపై వీరు దృష్టిసారిస్తారు.

భారత మార్కెట్‌కు తగిన ఉత్పత్తులను రూపొందించడంపై కూడా ఈ కేంద్రం దృష్టి సారిస్తుందని, ఇందుకోసం స్థానిక కంపెనీలు, యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తుందన్నారు. హెచ్‌డీఎంఐ వ్యవస్థాపక కంపెనీ అయిన సిలికాన్ ఇమేజ్ ఎంహెచ్‌ఎల్(మొబైల్ హైడెఫినిషన్ లైన్) వంటి కొత్త తరహా కనెక్టివిటీ పద్ధతులను రూపొందించింది. డబ్ల్యూఐఎస్‌ఏ ప్రాసెస్‌ను అభివృద్ధి చేస్తోంది. 2011లో కంపెనీ ఆదాయం 22.1 కోట్ల డాలర్లు కాగా, సిలికాన్ చిప్స్ వాటా 80-85 శాతం, ఐపీ రైట్స్ నుంచి 15-20% సమకూరుతోంది. సిలికాన్ ఇమేజ్ ఇండియా ఆపరేషన్స్ ఎండీగా డి.వి.ఆర్.మూర్తి వ్యవహరిస్తారు.

10 కోట్ల స్మార్ట్‌ఫోన్లకు ఎంహెచ్‌ఎల్: గతేడాది 5 కోట్ల స్మార్ట్‌ఫోన్లకు ఎంహెచ్ ఎల్ చిప్స్‌ను అందించామని, ఈ ఏడాది 10 కోట్ల ఫోన్లకు అందించనున్నామని మార్టినో చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 100 కోట్ల స్మార్ట్ ఫోన్ల (ప్రస్తుతం 50 కోట్లు)లో ఎంహెచ్‌ఎల్ సదుపాయం అవసరమవుతుందన్నారు. 2012 చివరి నాటికి అధునాతన అల్ట్రా హెచ్‌డీ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం 10 టాప్ టెలివిజన్ తయారీ కంపెనీల్లో 9 సంస్థలకు హెచ్‌డీ కనెక్టివిటీ సేవలందిస్తున్నామని, మొబైల్ ఫోన్లలో శ్యాంసంగ్ సహా అనేక సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నాయని తెలిపారు. డీహెచ్‌డీ(4కే) మార్కెట్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X