టెక్కీలు సేవలందించేందుకు ‘కోడ్ ఫర్ ఇండియా’

Posted By:

 టెక్కీలు సేవలందించేందుకు ‘కోడ్ ఫర్ ఇండియా’

వాషింగ్‌టన్: ఇండియన్ అమెరికన్ సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ పారిశ్రామికవేత్త కార్ల్ మెహతా 'కోడ్ ఫర్ ఇండియా' పేరుతో ప్రత్యేకమైన ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని గురువారం ఆవిష్కరించారు. సాంకేతిక నిపుణులు స్వచ్చందంగా ముందుకువచ్చి దేశానికి ఉపయోగపడే విధంగా సాఫ్ట్‌వేర్ ఇంకా అప్లికేషన్‌లను ఈ కార్యక్రమం ద్వారా వృద్ధి చేయవచ్చు. ఈ విప్లవాత్మక కార్యక్రమం ద్వారా లక్షల మంది ప్రోగ్రామర్లకు తమ సేవాతత్పురతను చాటుకోవాలని మెహతా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మెహతా నిర్వహిస్తున్న 'కోడ ఫర్ ఇండియా'కు వందల సంఖ్యలో ఇంజనీర్ల వద్ద నుంచి మద్దతు లభిస్తోంది. వీరిలో అత్యధికమంది ప్రోగ్రామర్లు గూగుల్, మైక్రోసాఫ్ట్, వీసా తదితర కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న వారే.

ఉద్యోగానికి బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు (2013)

గూగుల్.. ఫేస్‌బుక్.. ఆపిల్... లింకిడిన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఆ హుందానే వేరు. ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయకంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో 'బహుళజాతి' కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని 2013కు గాను గ్లాస్‌డోర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 20 టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగానికి ఉత్తమమైనవిగా నిలిచాయి. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. 

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot